Tuesday, August 16, 2011
చర్చలు
అదే మరి !!! హీనా రబ్బానీ , ఎస్ ఎం కృష్ణ కూర్చుని మాట్లాడుకుంటున్నపుడు ఇరువైపులా ప్రజలు శాంతి యుతంగా ఉండాలి. చర్చలు ఫలప్రదం అయినాక ప్రజా సేకరణ జరుగుతుంది. ఆ తరువాత పార్లమెంటు, ఆ తరువాత రాష్ట్రపతి దగ్గరకి వెళ్ళాలి. ఈ లోపుగా ప్రజలందరూ శాంతిగా ఉండి అడిగిన దానికి మాత్రమే సమాధానం ఇవ్వండి. ఇండియాకి కాశ్మీర్ కావాలి, ఆ ఒక్కటి అడగొద్దు అని అంటే ఎలా? పాకిస్థాన్ కీ కాశ్మీర్ కావాలి,ఆ ఒక్కటి అడగొద్దు అని అంటే ఎలా? తెలంగాణా వారికి విడాకులు కావాలి, ఆ ఒక్కటి అడగొద్దు అని అంటే ఎలా? ఆంధ్రా వారికి సమైక్యాంధ్ర కావాలి, ఆ ఒక్కటి అడగొద్దు అని అంటే ఎలా? వారికీ ఓడిపోవడం ఇష్టం లేదు, వీరికీ ఓడిపోవడం ఇష్టం లేదు. ఇద్దరికీ కాశ్మీర్ కావాలి, తెలంగాణా కావాలి కాబట్టి ఇద్దరూ కలిసి ఉండాలి. ఇద్దరూ కలిసి ఉండగలరా? ఒకే పని ఇద్దరు చేస్తున్నపుడు ఇద్దరూ విడిగా ఉండడం ఎందుకు? అందరూ కాశ్మీర్, తెలంగాణా కోసమే పోరాడుతున్నపుడు విడిగా ఎందుకు ఉండటం? కలిసి పనిచేద్దాం అని ఒక నిర్ణయానికి వచ్చాము. |
Monday, August 15, 2011
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
చిన్నపుడు నేను పల్లెటూరు లో పెరిగాను. 13 సంవత్సరాల తరువాత విజయవాడ వచ్చాము. అప్పటి వరకూ గవర్న్మెంట్ స్కూలో చదివాను. విజయవాడ వచ్చిన తరువాత కొత్తగా స్కూల్ లో చేరిన తరువాత అక్కడ మొదట మాకు ప్రేయర్ తరువాత ఒక శఫదం చేయించారు. అదేమిటంటే నాది భారతదేశం, నేను నా దేశమును ప్రేమించుచున్నాను, భారతీయులందరూ నా సహోదరులు , నేను నా దేశము పట్ల జాతి పట్ల విధేయుడనై /విధేయురాలినై ఉంటాను....... ఇలా ఉంది. అది చదివినపుడు నాకు ఒక డౌటు వచ్చింది, భారతీయులందరూ నా సహోదరులే అయితే మరి నా భర్త ని ఎక్కడి నుండి తెచ్చుకోవాలి ఇదేమి శఫధం? అని అనిపించేది. అక్కడ ఉన్నపుడు ఎపుడూ ప్రేయరే లేదు పల్లెటూరు కదా....విజయవాడ వచ్చాకనే చేయి ముందుకు చాపి ప్రమాణం చేయమన్నారు. అటువంటి ప్రమాణం ఎలా చేసేది? అందుకే నేను చిన్నగా నా భర్త తప్ప మిగతా భారతీయులంతా నా సహోదరులే అని ప్రమాణం చేసి అమ్మయ్య నేను మాట తప్పను అని అనుకున్నాను. కానీ పెళ్ళి అయిన తరువాత తెలిసింది అది కూడా తప్పే అని, అపుడు ఈ విడాకులూ గట్రా లేవు కదా అపుడు నాకు తెలియలేదు. నేనే శేర్ అనుకుంటే మా ఆయన సవాశేర్, తానొకటి తలిస్తే దైవమొకటి తలిచినట్లు పెళ్ళయ్యక ఆ మాటకి కట్టుబడి ఉండడానికి ఎంతో పోరాటం చేయాల్సి వస్తుంది. ఇప్పటికీ సూట్కేస్ ఎపుడూ రెడీ గా ఉంచుకుంటాను, ఏ రోజు ఏం జరుగుతుందో అని భయమే. భయమంటె భయం కాదు భక్తి అనుకోవచ్చు. అన్నీ చంపుకుని బ్రతకాలంటె ఎవరికైనా కష్టమే కదా !! ఒకరి స్వేచ్చా స్వాతంత్ర్యాలను ఇతరులు హరిస్తుంటే చూస్తూ ఎలా ఊరుకునేది? ఇంట్లో అంటే భర్త కాబట్టి భరిస్తాను, బయట కూడా ఎలా భరించేది? ఆంధ్రా వాళ్ళకేనా ఈ రాష్ట్రాన్ని పాలించే అర్హత? తెలంగాణా వాళ్ళకు లేదా? ఇండియాకేనా కాశ్మీర్ మీద హక్కు? పాకిస్థాన్ కి లేదా ఆ హక్కు? అమెరికాకేనా స్వేచ్చాగా ఉండే హక్కు? ఇండియా, పాకిస్ఠాన్ లకు లేదా ఆ హక్కు? ఒకరి ఫండమెంటల్ రైట్స్ బలవంతంగా ఇంకొకరు లాక్కుంటుంటే నేను పోరాడకుండా ఎలా ఉంటాను? కానీ ప్రమాణం చేసిన తరువాత మాటకి కట్టుబడి ఉండాలి, నేనేమీ రాముడి లాంటి దానిని కాదు, నాతి చరామి అన్న తరువాత పెళ్ళాన్ని వదిలేయలేదూ? అందుకే ప్రమాణం చేసేటపుడు ఆలోచించుకుని చేయాలి. ఆందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. |
Tuesday, June 28, 2011
What is Standard Of Life?
"స్టాండర్డ్ ఆఫ్ లైఫ్" అంటే ఏమిటి? అసలు "జీవితం" అంటే ఏమిటో తెలిస్తే కదా... స్టాండర్డ్ గురించి తెలిసేది. జీవితం అంటే సమస్యలని సాల్వ్ చేసుకుంటూ పోవడమే "జీవితం" అని నా ఉద్దేశ్యం . సమస్యలు లేని జీవితం ఉంటుందా ? నేను స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ గడపడం లేదనీ ..తనే నాకు స్టేటస్ ఇచ్చాననీ అంటున్నారు. తనకి జీవితం అంటేనే సరిగ్గా తెలియదని నా ఉద్దేశ్యం. ఏదయినా సమస్య వస్తే ముందు కంగారు పడిపోవడం సమస్య ఎలా సాల్వ్ చేయాలో ఆలోచించకుండా ఎందుకు వచ్చింది ముందు పోస్టుమార్టం చేస్తూ తిట్టడం ..... చిన్న సమస్య కూడా భూతద్దం లో పెట్టి చూడడం ఆయన పని, నేనేమో, రానీ... సమస్యని దాని సంగతి చూద్దాం అని అనుకుంటూ ఉంటాను. ఒకరి స్టాండర్డ్ ఏమిటి అన్నది ఎవరు నిర్ణయిస్తారు? నా స్టాండర్డ్ ఏమిటన్నది ఆయనకు తెలుసా ? నేనేమి కోరుకుంటున్నానో ఆయనకు తెలుసా? నా జీవితానికి "స్టేటస్" తనివ్వగలరా? తనిచ్చిన "స్టేటస్" నాకు నచ్చుతుందా? Standard Of Life is 1.Autonomy 2.Recognition 3.Sense of Belongingness 4.Self Development 5.Rewards And Benefits. అటానమీ అంటే స్వేచ్ఛ ....ఒకరికి ఒకరు స్వేచ్ఛ ఇవ్వగలరా? ఎవరికి వారు తెచ్చుకోవాలి. ఒకరు ఇస్తే వచ్చేది కాదు. స్త్రీలు స్వేచ్ఛ ని తమంత తాము కోరుకోరు. తమ స్వేచ్ఛని ఎవరైనా హరిస్తున్నారని భావించినపుడు మాత్రమే దానిని కోరుకుంటారు. ఎంత ఉద్యోగం చేసినా ఇంటి గురించి ఆలోచిస్తూ తమ స్వేచ్ఛ ని వారే వదులుకుంటారు. తాముగా వదులుకుంటున్నపుడు ఒకరు ఇచ్చేదేమిటి? రికగ్నిషన్ అంటే గుర్తింపు.... స్త్రీలకి గుర్తింపు ఉందా? వాళ్ళు చేసిన దానికి గుర్తింపు అంటూ ఉంటే ఈ "రమ్యంగా కుటీరాన" ఉండేది కాదు. సెన్స్ ఆఫ్ బిలాగింగ్ నెస్ అంటే అన్యోన్యత .... .పైన చెప్పిన రెండూ ఎవరికైతే దొరుకుతాయో వారు అన్యోన్యత సాధించినట్లే. సెల్ఫ్ డెవెలప్ మెంట్ అంటే సాధికారత .... వ్యక్తిగత సంతోషం మరియు కుటుంబ లక్ష్యాలు రెండూ కలిసి సాధించగలిగితే అదే సాధికారత. రివార్డ్స్ అండ్ బెనిఫిట్స్ అంటే బహుమతులు, అనుభూతులు,అనుభవాలు. ---- పైన చెప్పినవాటిని ఒకరికి ఒకరు ఇవ్వలేరు, ఇవ్వాలని ప్రయత్నించడం, ఇవ్వలేదని బాధ పడడం వ్యర్ధం. ఎవరికి వారు సాధించుకోవాలి. నాకు నచ్చినట్లుగా నా జీవితం గడపడమే నా "స్టాండర్డ్" ... నా"స్టేటస్". |
