TRUE LEARNING TAKES ENERGY,PASSION,A BURNING DESIRE



u.neeharika@gmail.com...

..

...

Friday, June 19, 2009

మనస్థత్వాన్ని తెలుసుకోవడం వల్ల ఉపయోగమేమిటి?
అరిస్టాటిల్ అన్నట్లు "ప్రశాంతంగా జీవించటానికే మనం యుద్దాలు చేయవలసివస్తుంది" ఒకవిధంగా struggle for existance అన్నమాట.
మనం రోజూ ఏదో ఒక పనికోసం ఎవరినో ఒకరిని కలవవలసి వస్తుంది.వివిధ రకాలవ్యక్తులతో కలిసి పనిచేయవలసివస్తుంది.అత్తమామలతో,ఆడబిడ్డలతొ,చుట్టుప్రక్కల వారితో భార్యాభర్తలతో,పిల్లలతో వ్యవహరించాల్సివస్తుంది.ఇంతమందితో సఖ్యంగా,ఏ గొడవలు లేకుండా ఉండాలంటే వారి మనస్థత్వాన్ని తెలుసుకోవడం ఎంతైనా మంచిది.భార్యాభర్తలు ఒకరి మనస్థత్వాన్ని ఒకరు తెలుసుకోవడం వల్ల ఒకరినొకరు అర్ధం చేసుకోగలుగుతారు.

ఈ ప్రపంచంలో పుట్టిన ఏ ఇద్దరూ ఒక్కలా ఉండరు.అంతెందుకు మనకు పుట్టిన మన పిల్లలే ఒక్కలా ఉండరు.మరి వేరు వేరు ప్రాంతాలలో పుట్టిన భార్యాభర్తలు ఒకటిగా ఎందుకు ఉంటారు? ఇద్దరి మనస్ఠత్వం ఒక్కటి గా ఉండనవసరంలేదు.ఉండకూడదు కూడా.కానీ ఒకరి మనస్థత్వాన్ని ఒకరు తెలుసుకోమంటున్నాను. భార్యాభర్తలు అవతలివారు మారాలని చూస్తారు.అది తప్పు.మీ భాగస్వామి మనస్థత్వాన్ని తెలుసుకుని మీరు మారండి.మార్చటం కష్టం. మారటం సులభం.ఇది మన చేతుల్లో పని.అసలు భార్యాభర్తలు southpole, northpole లాగా ఉండాలి.ఎందుకంటే సజాతి ద్రువాలు వికర్షించుకుంటాయి,విజాతి ద్రువాలు ఆకర్షించుకుంటాయి కాబట్టి బంధం strong గా నిలబడుతుందన్నమాట.life romantic గా ఉంటుంది.

ఇకపోతే ఒకే నెలలో పుట్టిన ఇద్దరు వ్యక్తుల మనస్థత్వం కూడా ఒక్కటిగా ఉండదు. జనవరి1 న A మరియు B అనే వేర్వేరు వ్యక్తులు పుట్టారనుకుందాం. A తల్లి తండ్రుల characters వేరు, B తల్లితండ్రుల characters వేరు కాబట్టి వారిద్దరి మనస్థత్వం కూడా వేరుగానే ఉంటుంది. A మరియు B ల basic characters same ఉంటాయి.కానీ behaviour లో difference ఉంటుంది. వారి వారి తల్లితండ్రుల ప్రభావం,పరిసరాలు, పెరిగినతీరు ఇలా ఎన్నో అంశాలు ఒక వ్యక్తికి ముడిపడి ఉన్నాయి. ఇన్ని చూడాలా? అని అంటారా... ఏదీ ఊరికే రాదు,16 సంవత్సరాలు కష్టపడి చదివితేనే ఉద్యోగం వస్తుంది. మరి కనీసం 50 సం.లు కలిసి కాపురం చేయాలి కదా! కొంచెం ఓర్పుగా మీ భాగస్వామిని అర్ధం చేసుకోండి. భాగస్వామినే అని కాదు ఎదుటివ్యక్తిని అర్ధం చేసుకోండి. మానవసంభంధాలను మెరుగుపరుచుకోండి. మళ్ళీ కలుద్దాం.

Labels:

5 Comments:

రమ్య చాలా బాగుంది మీ బ్లాగ్ టెంప్లేట్ చూడగానే ఎందుకో నాగు తెగ నచ్చేసింది... మీ పోస్ట్ లన్నీ కూడా బాగున్నాయి... మంచి ప్రయత్నం...

June 19, 2009 6:53 AM  

Ramya garu,

Template design and the color are very beautiful....

June 19, 2009 11:52 AM  

Interesting :-)

June 19, 2009 12:16 PM  

భవన గారు,చాణక్య గారు నా పేరు రమ్య కాదు నీహారిక.
మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.

June 19, 2009 3:14 PM  

సారి నీహారిక. ఏమిటో రమ్యం గా అని కనపడింది మీ బ్లాగ్ కూడా రమ్యం గా వుంది అందుకే మీ పేరు కూడా రమ్య అనుకున్నా... సారి..

June 20, 2009 8:08 AM  

Post a Comment

Links to this post:

Create a Link

<< Home