Friday, September 11, 2009

జీవితాంతం బరువు పెరగకుండా ఉండాలంటే ఎలా?

ఈ మధ్య బ్లాగుల్లో వస్తున్న వంటల పోస్టులు చూసి అసూయతో వ్రాస్తున్న పోస్ట్ ఇది.... నాకు జీవితంలో నచ్చని ఒకే ఒక్క పదం వంట... వంట అంటేనే నాకు ఒళ్ళు మంట..... అలా అని వంట వచ్చిన వాళ్ళంటే కడుపుమంటేం లేదనుకోండి...వంటలు చేసేవాళ్ళని,వంటల ప్రోగ్రామ్స్ ని కళ్ళార్పకుండా చూస్తాను...చూడడమంటే సరదా కానీ చేయడంలో కాదన్నమాట....మరి మా ఇంట్లో ఎలాగా,మా వారు చేస్తారా అని అనుకుంటున్నారా? అమ్మా ఆశ దోశ ..మావారు మిస్టర్ పెళ్ళాం లో రాజేంద్రప్రసాద్ టైప్ అన్నమాట పేస్టు,...బ్రష్...టవలు,...మంచినీళ్ళు,...ఫాను,....రిమోట్,...ఇలా ఒన్  వర్డ్ మాత్రమే యూస్ చేసి పనులు చేయించుకునే రకం.
ఆరోగ్యం పట్ల, శరీరం పట్ల ,మావారికి ,నాకు ఉన్న శ్రద్ద వల్ల నాకు వంట రాక పోయినా గడచిపోతున్నది...కానీ మా అబ్బాయి మాత్రం మమ్మీ దీన్ని వంటంటారా అని ప్రశ్నిస్తూ ఉంటాడు....మావారు కూడా అప్పుడప్పుడు అడుగుతారనుకోండి....నేనే కనుక బాగా వంట వచ్చిన దాన్నయి ఉంటే మీరు,నేను,సిద్దార్ధ్ బాగా తినేసి బాగా లావయిపోయిఉండేవాళ్ళం....మొన్న పార్టీలో మీ ఫ్రెండ్ ఏమన్నారు?మీరు ఎన్నాళ్ళయినా లావవరా? అని అడిగారా లేదా? అని దబాయించేస్తాను.

మా అమ్మ ఎపుడైనా ఏదైనా ఊరికెళ్ళవలసి వస్తే నేను వెళ్ళనిచ్చేదాన్ని కాదు,నేను కూడా వస్తాను అని వంతు వేసుకుని కూర్చునేదాన్ని,ఇంట్లో ఉంటే వంటెవరు చేస్తారు, నేను కూడా వస్తాను అని గొడవ చేసేదాన్ని, మా అమ్మ ఊరుకునేది కాదనుకోండి....అటువంటి గత్యంతరం లేని పరిస్థితుల్లో వంకాయకూర మాత్రం చేసేదాన్ని,..ఎందుకంటే వంకాయ కూర అయితే త్వరగా అయిపోతుంది,త్వరగా వంటగదిలోనుండి బయట పడి పోవచ్చు అన్నమాట.

పెళ్ళయిన తరువాత కొత్త కదా,వస్తూ వస్తూ మా అమ్మ వంటల పుస్తకం తెచ్చేసుకున్నాను. రోజుకొకటి చదవటం ప్రాక్టికల్స్ చేయడం,పెళ్ళికి ,చావుకీ ఒకటే మంత్రం లాగా అన్ని రకాల కూరగాయలకీ ఒకటే సూత్రం,తాలింపు వేయడం, ఉల్లి పచ్చిమిర్చి వేయడం, కూరగాయముక్కలు వేయడం,వేగాక ఉప్పు,పసుపు, కారం వేయటం వేగాక దింపేయడం......ఇక ఆదివారాలు వచ్చాయంటే మా ఆడపడుచు హాస్టల్ నుండి భోజనానికి వచ్చేది....నాన్ వెజ్ వండాలి కదా దానికీ అంతే ఉల్లిపచ్చిమిర్చి వేగాక అల్లం వెల్లుల్లి వేసి చికెన్ గాని మటన్ గాని వేసి వేగాక ఉప్పు పసుపు కారం వేసి వేగాక నీళ్ళుపోసి కుక్కర్ లో మూడు విజిల్స్ వచ్చేవరకు ఉంచి,మూతతీసాక గరం మసాలా వేసి కూర దగ్గర పడే వరకు ఉంచి దింపేయడం....కొత్తకదా మా ఆడపడుచు,మా ఆయన బాగానే ఎంజాయ్ చేసేవారు.మా ఆడపడుచు తిని ఊరుకోకుండా మా వదిన బాగా వంట చెస్తుంది అని ఊరంతా ప్రచారం చేసేది....అది విని మా ఆయన ఉబ్బిపోయి మెల్లగా ఫ్రెండ్స్ ని భోజనానికి పిలిచేవారు, అదీ ఒకరో ఇద్దరు కాదు పది మంది నాకు ఒకటే టెన్షన్ అసలే వంట ఇష్టంలేదు, పది మందికి వండాలంటే ఒకటే కంగారు, december 31st night dinner మా ఇంట్లోనే ఏర్పాటు చేసేవాళ్ళు ,తనేమో మా ఆవిడ వండేస్తుంది అని మాట ఇచ్చేసేవారు,నేను వారం ముందునుండి టెన్షన్ పడేదాన్ని,ప్రక్కింట్లో ఒక ముస్లిం ఆంటీ ఉండేవారు.ఆవిడ హెల్ప్ తీసుకుని న్యూఇయర్ సెలబ్రేషన్స్ కానిచ్చేసేదాన్ని.

ఇక పండగలు వస్తున్నాయంటే నాకు హడల్...ఒకటి కాదు రెండు కాదు,నెలకొకటి చొప్పున హిందువులకున్న పండుగలు ఎవరికీ లేవు..అసలు ఈ పండగలు ఎవరు కనిపెట్టారో గానీ వాళ్ళని నేను పండగరోజు తిట్టుకోకుండా ఉండను. ఉగాది,...శివరాత్రి,...శ్రీరామనవమి,... వరలక్ష్మీవ్రతం,... వినాయకచవితి,...దసరా,...దీపవళి,
సంక్రాంతి... ఇవేకాకుండా మా మ్యారేజ్ డే మరియు బర్త్ డేస్....ఇవన్నీ నాకు మంత్లీటెస్ట్ లన్నమాట...నెలకొకటి నాఖర్మానికి.....పండగరోజు ప్రొద్దున్నే ముగ్గుతో స్టార్ట్ అవుతుంది స్నానం అయ్యాక పూజ తరువాత వంట సెక్షన్ మొదలు, నేను ఏమి చేస్తానో అని ఏదేదో ఊహించుకుంటారు....అంతా అయినాక తిని ప్రొద్దున్ననుండి వాసనలు మాత్రం వస్తున్నాయి, నువ్వు చేసింది ఇంతేనా అని నిట్టూరుస్తారు.అప్పుడు చూడండి నా కోపం...వాళ్ళనేమీ చేయలేక నా కోపం గిన్నెల మీద చూపిస్తాను.

ఇంతకీ నేను చెప్పొచ్చేదేమిటంటే మీరు జీవితాంతం సన్నగా ,బరువుపెరగకుండా ఉండాలంటే అబ్బాయిలైతే వంటంటే ఇష్టం లేని అమ్మాయిని పెళ్ళిచేసుకోండి. అమ్మాయిలైతే ఆరోగ్యం పట్ల శ్రధ్ద ఉన్న అబ్బాయిలని చేసుకోండి. మీరు జీవితాంతం నాగార్జున అమలల్లాగా హాయిగా ఆనందంగా ఉంటారు.

16 comments:

జ్యోతి said...

మీ సలహా బావుంది కాని అది వర్కవుట్ కాదులెండి. ఎవరో కొందరు అదృష్టవంతులు ఉంటారు వంట బాగా వచ్చిన మొగుళ్లు హాయిగా నామోషీ లేకుండా ఉత్సాహంగా వంట చేస్తారు. అలాంటి వాళ్లగురించి తెలిసినా , చదివినా నాకు మావారి మీద కోపం వస్తుంది. వాళ్ల భార్యాలను గురించి తలుచుకుంటే నాకు అసూయగా ఉంటుంది. మన బ్లాగర్లలోఅలాటి వారున్నారు. నాకు వంట బాగా వచ్చు అని గర్వంగా చెప్పుకునే వ్యక్తి..

Vinay Chakravarthi.Gogineni said...

hahhaaha........i am very particular abt food.moral sangatemo gani......narration is nice.....

సుజాత said...

ఏదో చెప్తారని ఆశపడి వస్తే ఇదా సలహా? తీవ్రంగా ఖండిస్తున్నాను.

నేనూ మొదట్లో వంట నేర్చుకోకుండా హాయిగా జాలీగా గడిపేసి అమెరికా వెళ్ళాక రోజూ బయట తినే స్థోమత అక్కడ ఉండదని గ్రహించాక చచ్చినట్లు మాలతీ చందూర్ గారి సహాయంతో వంట నేర్చుకున్నాను. ఇంకేముంది, ఒకసారి వచ్చాక అది కంటిన్యూ కాక చస్తుందా? అడ్వాంటేజ్ ఐపోయింది.

అయినా పప్పులో పప్పు తక్కువైంది, ఇడ్లీలో పిండి తక్కువైంది లాంటి వంకలు మొదట్లో వచ్చేవి కానీ తర్వాత పరిస్థితి మారింది.అలవాటైపోయిందన్నమాట.

సుభద్ర said...

వావ్ భలే రాసారు....నాకు పెద్దగా వ౦ట రాదు పెళ్ళినాటికి..ఇప్పుడు గుడ్ అనుకో౦డీ.
మీ సలహ నాకు నచ్చి౦ది...కాని పదెళ్ళ ము౦దు నేను ఈ పొస్ట్ చదివి ఉ౦డాల్సి౦ది.
ఐ యమ్ లేట్...

చిన్ని said...

nice ;)

కొత్త పాళీ said...

ha ha ha :)

నీహారిక said...

@జ్యోతి గారు,
వంట వచ్చిన మగవాళ్ళతో కష్టం అండీ,అన్నిటికీ పేర్లు పెడతారు.
వినయ్ గారు,
Thanks.

సుభద్ర గారు,
ఇపుడు మాత్రం ఏమయిందండీ,మీ ఇద్దరు అబ్బాయిలలో ఆరోగ్యం పట్ల ఎవరికి శ్రద్ధ ఉందో వాళ్ళకి పనికి వస్తుందీ సలహా.ఏమంటారు?

నీహారిక said...

@సుజాత గారు,
sorry.
కొత్తపాళీ గారు,చిన్ని గారు,
Thanks.

మాలా కుమార్ said...

అబ్బ వంట పనిలేని రోజు వుంటే ఎంత బాగుంటుందో కదా ! పొద్దున లేచినప్పటి నుండి పడుకునేదాకా తిండి గోలే !
మీరు 40 సంవత్సరాల తరువాత ఈ సలహా ఇస్తే ఎలాగండీ !

నీహారిక said...

mala gaaru,

next generation ki paniki vastundilendi.

Thanks.

kiranmayi said...

ఏదో పాత పోస్ట్ లో సన్నబడే టాక్టిక్ చెప్పేసుకున్నారు నేను మిస్ అయ్యిపోయ్యా అని గబ గబా మీ బ్లాగ్ లోకొస్తే , మీరిచ్చే సలహా ఇదా. నాకు బాగా కోపమొచ్చేసింది.

నీహారిక said...

కిరణ్మయి గారు,
అలగకండీ,please.మీ స్వీట్ పోస్ట్ చూసినప్పటి నుండి మిమ్మల్ని తలచుకుంటూనే ఉన్నాను.

srilu said...

ఈటైటిల్ చూసి మీరేమైనా టిప్పులులాంటివి ఇస్తారేమోననుకొని ఆశగా వచ్చి చూస్తే ఏమీ లేకపోగా ఒక ఉచిత సలహా మటుకు ఇచ్చారు. కానీ మీరు వ్రాసిన తీరు చాలా బాగుంది :)

బైదవే వంకలు పెట్టటానికి వంట రావలసిన అవసరం లేదండి వంట రాని వాళ్ళు కూడా వంకలు పెడతారు :p

నీహారిక said...

sreelu,

బరువు పెరగకుండా ఉండటానికి ఇంతకన్నా వేరే solution నాక్కనపడలేదు మరి!

Anonymous said...

చాల బాగ చెప్పరంది.ladies ఈ cooking గొల నించి తప్పించు కొవదం అంత ఈజీ కాదు లెందు.చిన్నప్పుదు మాఇంగ్లిష్ సార్ meeru eat to live or live to eat? అని అదిగితె ఇన్స్పిరె అయి commited also.but' పెల్లయ్యక అర్ధమయింది అర్ధాంగి యొక్క ముఖ్య కర్తవ్యం అదెనని .unless she considered a waste fellow though she has so many other skills.so i hate cooking

నీహారిక said...

Anonymous gaaru,

అందుకే వంట అంటే ఇష్టం లేని అమ్మాయిని చేసుకోమనేది!!!