Thursday, October 22, 2009

గోదావరి అమ్మాయిలు v/s కృష్ణా అమ్మాయిలు

గమనిక: ఈ పోస్ట్ సరదా కోసం వ్రాసినది కాబట్టి ఎవరూ ఉడుక్కోకూడదు మరియు నన్ను తిట్టకూడదు.

నేను పుట్టినది కృష్ణా అయినా మెట్టినది గోదావరి కనుక ఈ రెండు జిల్లాలతో నాకు పరిచయాలుండటం చేత వ్రాస్తున్నాను.

గోదావరి అమ్మాయిలు ముగ్దమనోహర మందారాలయితే కృష్ణా అమ్మాయిలు లేలేత గులాబీలు.
మందారాలు మెత్తగా సుకుమారంగా ఉంటే గులాబీల క్రింద ముళ్ళు ఉంటాయన్నమాట.

కృష్ణా అమ్మాయిలు సీమటపాకాయల్లాంటి(ఒకసారి గట్టిగా పేలవచ్చు,ఒకోసారి తుస్సుమనొచ్చు) వారయితే, గోదావరి వాళ్ళు చిచ్చుబుడ్లు లాంటి వారన్నమాట(వాళ్ళు కాలిపోతూ వెలుగులు పంచుతారు)

గోదావరి అమ్మాయిలు సతీ సావిత్రులు అయితే కృష్ణా అమ్మాయిలు ఝాన్సీ లక్ష్మీబాయిలు.

అందంలో,లౌక్యంలో కృష్ణా అమ్మాయిలు ముందుంటారు, తెలివితేటలు,హాస్యంలో గోదావరిదే పైచేయి.

ఆచారవ్యవహారాలలో గోదావరి వారికే పట్టింపులు ఎక్కువ.

గోదావరి పడచులు జీవితాన్ని చదివితే కృష్ణా అమ్మాయిలు పుస్తకాలు చదువుతారు.

భర్త నీడలో గోదావరి పడతులు నడుస్తే, భర్తని కొంగుకి కట్టుకుని కృష్ణా అమ్మాయిలు నడుస్తారు.

సినిమాలు,పాటలు,పర్యాటకం కృష్ణా అమ్మాయిల అభిమాన విషయాలయితే సీరియళ్ళు, కష్టాలు, కన్నీళ్ళు గోదావరి అబలల ఆవాసాలు.

గోదావరి అమ్మాయితో ఎవరయినా నెట్టుకు రాగలరు, కృష్ణా అమ్మాయిలతో నెట్టుకురావాలంటే కత్తి మీద సామే.

ఆరోగ్యంగా ఎక్కువ కాలం గోదావరి అమ్మాయిలు జీవిస్తారు, ఆనందంగా తక్కువ కాలం కృష్ణా అమ్మాయిలు జీవిస్తారు.

సంప్రదాయ వంటలు గోదావరి వాళ్ళు బాగా చేస్తే ఆధునికంగా కృష్ణా అమ్మాయిలు చేస్తారు.

కలుపుగోలుతనం,ముక్కుసూటితనంలో కృష్ణా అమ్మాయిలు ముందుంటే, ఒంటరితనంలో,ఆచి తూచి మాట్లాడటంలో గోదావరి వాళ్ళు ముందుంటారు.

కష్టాలు వస్తే కృష్ణా అమ్మాయిలు ఎదురుతిరుగుతారు,ధైర్యంగా నిలబడతారు, గోదావరి అమ్మాయిలు కష్టాలతో కాపురం చేస్తారు.

ఉద్యోగం,కాపురం రెండిటిలో ఏదో ఒకటి ఎంచుకోవల్సి వస్తే,గోదావరి వనితలు ఉద్యోగాన్ని, కృష్ణా వనితలు కాపురాన్ని కోరుకుంటారు.

ఆఖరిగా కృష్ణా అమ్మాయిలు బాపు బొమ్మలయితే, గోదావరి అమ్మాయిలు వంశీ ముద్దుగుమ్మలు.

37 comments:

aswin budaraju said...

బా రాశారండి.

Krishna Chaitanya said...

చాలా బాగున్నదండి మీ పరిశీలన. మరి మాలాంటి గుంటూరు అమ్మాయిల గురించి కూడా ఒక పోస్ట్ రాయండి...

భమిడిపాటి సూర్యలక్ష్మి said...

చాలా చక్కగా రాసారండి. చాలా రోజుల తరువాత ఈ రొజే నేను కూడలి మిత్రులను కలవడానికి వచ్చాను, మీ పొస్ట్ చాలా బాగుంది.

swathimadhav said...

hi
bagundandi mi post.
nenu krishna jilla adapaduchune.
godavari jilla gurinchi asslu tleiyadandi.endukante mavaridi guntur kada.so rendu dagagre.pedda
difference ledu.

sivaranjani said...

hai! గోదావరి అమ్మాయిల గురించి superb గా రాసారు. Thanks alot ఎందుకంటే నేను కూడ గోదావరి అమ్మాయినోచ్ .

sunnygadu said...

రైటో

మాలా కుమార్ said...

టైటిల్ చూసి ఏమో అనుకున్నాను. ఎంతవరకు కరెక్టో కాని మీ విశ్లేషణ బాగుంది .

gabhasthi said...

goodanalisys.godavari belle is emotionally dependentn where krishna ' is self dependent

శ్రీనివాస్ said...

ఇంతకీ మొగుడ్ని అప్పడాల కర్రతో కొట్టని వారెవరు గోదావరి వారా లేక కృష్ణా అమ్మాయిలా ఆ మాటర్ చెప్తే కుర్రాళ్ళు జాగర్త పడతారు

Swarnamallika said...

నేను ఒప్పుకుంటానండీ మీ అభిప్రాయాన్ని. కానీ అన్ని విషయాలు కాందండోయ్. బాగా చెప్పారు మీరు. మంచి పరిశీలన. ఇంతకీ నేను క్రిష్ణా అమ్మాయిని. మాది విజయవాడ. నా అత్త గారిది కూడా విజయవాడే.

Swarnamallika said...

నేను ఒప్పుకుంటానండీ మీ అభిప్రాయాన్ని. కానీ అన్ని విషయాలు కాందండోయ్. బాగా చెప్పారు మీరు. మంచి పరిశీలన. ఇంతకీ నేను క్రిష్ణా అమ్మాయిని. మాది విజయవాడ. నా అత్త గారిది కూడా విజయవాడే.

Swarnamallika said...

ఆ ఇంతకీ మీరు ఇలా చెప్పెస్తే మరి మన క్రిష్ణా ఆడ పడచులకు పెళ్ళి సంబంధాలు ఎలా కుదురుతాయండీ. మీరు మరీను ఏదీ దాచుకోలేరా. అలా చెప్పేకండీ ప్లీజ్. ఎందుకంటే మగాళ్ళు ఎప్పుడూ చెప్పిన మాట వింటూ వాళ్ళ అధీనంలో ఉండె పిల్లని కదా కోరుకుంటారు. అది మరి సంగతి.

నీహారిక said...

అశ్విన్ గారు,సూర్యలక్ష్మి గారు,స్వాతి మాధవ్ గారు,శివరంజని గారు,సన్ని గారు,మాల గారు,అందరికీ ధన్యవాదాలు.
చైతన్య గారు,
గుంటూరు,కృష్ణ రెండిటికి పెద్దగా తేడాలేదండి,ప్రక్కనే కదా!
gabashi gaaru,
yes,you are right.

స్వర్ణ మల్లిక,శ్రీనివాస్ గారు,
ఎవరి అభిరుచిని బట్టి వారు తమ భాగస్వామిని ఎంచుకుంటారనే చెప్పాను.కొందరు fast గా ఉండే అమ్మాయిలని ఇష్టపడతారు,కొందరు slow గా ఉండే అమ్మాయిలని ఇష్టపడతారు.
అందరికి ధన్యవాదాలు

నాగప్రసాద్ said...

మీ పరిశీలన ప్రకారంగా చూస్తే, మా రాయలసీమ అమ్మాయిలే ఎంతో బెటరన్నమాట. మొగుడు ఏ పనీ చేయకుండా, జల్సా చేస్తూ బేవార్స్‌గా తిరిగినా సరే, ఏదో ఒకపని చేస్తూ, సంసారాన్ని వీధిన పడెయ్యకుండా ఒంటి చేత్తో లాక్కొచ్చేస్తారు. ఇంతా చేస్తూ కూడా మొగుడుకు ఎదురు చెప్పకుండా, అణకువగా ఉంటారు. :).

చిన్ని said...

చక్కటి అనాలిసిస్...కాపురం ,ఉద్యోగం కోరుకునే విషయం లో కృష్ణ అమ్మాయిలూ ఉద్యోగంకి ప్రాధాన్యత ఇస్తారు ..గోదావరి ఇంతులు తెల్లారి లేస్తే "మా ఆయనగారు "అంటూ జపం చేస్తారు ...వాళ్ళ కబుర్లన్నీ ఎక్కువ ఫ్యామిలీ చుట్టూనే వుంటాయి .నాకును కృష్ణ గోదావరులతో అనుభంధం ఎక్కువే .

శారద said...

మరి హైదరాబాదు అమ్మాయిలు?
(తమిళ అబ్బాయిల ప్రాణాలు తోడటానికి జన్మించిన ఒక deceptively sweet species అని మా వారి ఉవాచ :) )
శారద

నీహారిక said...

@నాగప్రసాద్ గారు,
అమ్మో రాయలసీమ అమ్మాయిలతో పోటీపడదామనే,ఎంత ధైర్యం ఉండాలి?

@చిన్ని గారు,
కృష్ణా అమ్మాయిలు ఉద్యోగం ఎందుకు చేయరండి?
చేయనిస్తే కదా!ఉద్యోగం,కాపురం ఏది కావాలో తేల్చుకోమని తల్లితండ్రులు కూడా బెదిరిస్తారు.

@శారద గారు,
తమిళ అబ్బాయితో ఎలా వేగుతున్నారండీ?

anveshita said...

మరి రాయలసీమ వాళ్ళో!!!!!!

నీహారిక said...

anveshita gaaru,

నాగప్రసాద్ గారు చెప్పారు చూడండి.

సిరిసిరిమువ్వ said...

బాగుంది మీ పరిశీలన. కృష్ణా వాళ్ల గురించి మీరు వ్రాసింది నిజమే కాని ఎంత మీ పక్క జిల్లా అయినా మా గుంటూరు వాళ్లని కూడా మీ గాటనే కట్టేయటం ఏం బాగాలేదు, ఇక్కడ మా మనోభావాలు దెబ్బ తిన్నాయి! మనలో మన మాట..మా గుంటూరు వాళ్లకి కృష్ణాజిల్లా వాళ్లంటే బోలెడు భయం..సంబంధాలు కలుపుకోవటానికి చాలా భయపడతారు:)

శ్రీలలిత said...

ఆమధ్య ఎవరో కృష్ణా, గోదావరీ జలాల మీద పరిశోధన చేసినాయన చెప్పగా విన్నాను..
గోదావరీ జలాలలో నెమ్మదితనం ఉందిట.. అదే కృష్ణా జలాలలో చురుకుపాలు ఎక్కువట..

నీహారిక said...

సిరిసిరిమువ్వ గారు,
ఇలా నన్ను తిట్టటానికిఅయినా నా బ్లాగుకి వచ్చినందుకు ధన్యవాదాలు.క్రిష్ణాజిల్లాలో అమ్మాయిలు లేరండి సంభంధాలు కలుపుకోవడానికి,సింహాలు ఎక్కువగా ఉండవండి.Now krishna girls are extinct.

శ్రీలలిత గారు,
అవును,నిజమేనండి గోదావరి నీళ్ళు మట్టిగా ఉంటాయి,క్రిష్ణా నీళ్ళు fresh గా ఉంటాయి.అందుకే తెలివితేటలు krishna వాళ్ళకే ఎక్కువుంటాయంటారు.

Sri Vallabha said...

"కృష్ణా అమ్మాయిలు బాపు బొమ్మలయితే, గోదావరి అమ్మాయిలు వంశీ ముద్దుగుమ్మలు."ఈ పోలిక అద్భుతం!

'Padmarpita' said...

Last point is simply superb:)

నీహారిక said...

పద్మార్పిత గారు,
ధన్యవాదాలు.

kiranmayi said...

నాకు గోదావరి అమ్మాయిల (వీళ్ళని అమ్మాయిలు అనే కంటే, లేడీస్ అంటే బెటర్ ఏమో, ఎందుకంటే నేను చెప్పేది మా అమ్మ, పిన్ని, అత్తయ్య types గురించి) గురించి తెలుసు కాని కృష్ణ ఎక్కువ తెలీదు. నేను పెరిగింది హైదరాబాద్ లోనే. కాబట్టి హైదరాబాద్ అమ్మాయిల గురించి మాత్రం శారద గారి ఆయన గారి అనాలిసిస్ మాత్రం నేనోప్పేసుకున్తానోచ్. అయినా మీరు హైదరాబాద్ వాళ్ళ గురించి వ్రాయట్లేదేమి?

నీహారిక said...

కిరణ్మయి గారు,
hyderabad ని ఫ్రీజోన్ చేసేసాం.hyderabad అమ్మాయిలు ఎక్కడైనా బ్రతికేస్తారు.ప్రత్యేకంగా వ్రాయక్కరలేదులెండి.

Kishen Reddy said...

devuda...o manchi devuda..nakoka andamaina, konaseema kobbari nellantha tiyyaga matlade ammaini wife ga prasadinchi swamy...istav...nuvvistav..naku telsu...bcoz ur basically good good..a very good god.

నీహారిక said...

kishan reddy gaaru,

తధాస్తు.

సుభద్ర said...

చాలా బాగు౦ది ....అన్ని కరెక్టుగానే రాశారు..
నేను విన్న ఒక మాట చెపుతా నిజమొకాదో చెప్ప౦డి..
గోదావరి వాళ్ళూ కొడుకుల క౦టే కుతుళ్ళనే ఎక్కువచూస్తారట!!!!నిజమేనేమొ(మాది తు"గో"జి) కృష్ణావాళ్ళు కొడుకులకి బాగా ముట్టజేపుతారట!!!

నీహారిక said...

subhadra gaaru,
కొంతవరకు నిజమే, కానీ ఇద్దరూ ఆడపిల్లలని ప్రేమిస్తారు,కానీ గోదావరి వాళ్ళు కట్నాలు ఎక్కువ ఇవ్వరు,కృష్ణావాళ్ళు కట్నాలు ఎక్కువ ఇస్తారు.
అందరూ మగపిల్లలకే ఆస్తులు ఎక్కువ కట్టపెట్తారు. మనకి తెలిసినా తెలియనట్లు ఊరుకుంటాము.పుట్టింటి ప్రేమ!!!!!!

రాజేంద్ర కుమార్ దేవరపల్లి said...

గుంటూరు,కృష్ణ రెండిటికి పెద్దగా తేడాలేదండి,ప్రక్కనే కదా!
ఉంది బోలెడంత గుంటూరు గుంటూరే,కృష్ణా కృష్ణానే!
పక్కపక్కనే ఉండటం వల్ల తేడా ఉండదంటే కృష్ణా పశ్చిమగోదావరి కూడా కలిసేపక్కపక్కనే ఉంటాయి కదండి!మీకూ మాకూ కనీసం నది అడ్డం ఉంది :)

నీహారిక said...

rajendra kumar gaaru,
నిజమే కదా!!!!!

ఏకాంతపు దిలీప్ said...

అంతా బాగానే ఉంది కానీ ఈ చివరది ఖండిస్తున్నా!

"ఆఖరిగా కృష్ణా అమ్మాయిలు బాపు బొమ్మలయితే, గోదావరి అమ్మాయిలు వంశీ ముద్దుగుమ్మలు."


బాపు గోదావరి ఒడ్డున పుట్టాడు. అతని బొమ్మలకి ప్రేరణ గోదావరి అమ్మాయిలే. సో బాపూ బొమ్మలైనా, వంశీ ముద్దు గుమ్మలైనా గోదావరి అమ్మాయిలే! :) చూసారా మా గోదావరి అబ్బాయిల్లో ఎంత భావుకత్వమో, అది రాతలైనా గీతలైనా! మా వాళ్ళు గీసిన బొమ్మలనే మీ వాళ్ళకి వాడుకుంటున్నారు...

నీహారిక said...

అంతేనంటారా!!!

ఏకాంతపు దిలీప్ said...

అంతే కదండీ! :)

అన్నట్టు బాపు ఇటు గోదారి ఒడ్డున పుడితే, వంశీ అటు ఒడ్డున పుట్టాడు...

Dr.Amar said...

Wow
It's been a log time that I read this kind of litrature
Nice
By the way, I had the same experience with Godavari and Krishna like you, but a bit difference, that is I born in Godavari and studied at Krishna