Thursday, October 29, 2009

గోదావరి అబ్బాయిలు v/s కృష్ణా అబ్బాయిలు

గమనిక: ఈ పోస్ట్ లో నేను వ్రాసింది 100% కరెక్ట్ అని నేను చెప్పడం లేదు...నా అనుభవాలనుండి నేను తెలుసుకున్నది తెలియపరచాలని నా ఉద్దేశ్యం...ఇక ముందు నేను వ్రాయబోయే పోస్ట్ లకు ఇది సహాయకారిగా ఉంటుంది అని నేను వ్రాస్తున్నాను... 

గోదావరి అబ్బాయిలు బోలెడంత తెలివి,బోలెడంత లౌక్యం,బోలిడంత పొగరు కలిగిన నల్లని కన్నయ్యలు,కృష్ణా అబ్బాయిలు కాస్తంత తెలివి, కాస్తంత లౌక్యం,కాస్తంత పొగరు కలిగిన నీలమేఘశ్యాములు.

గోదావరి అబ్బాయిలు పెళ్ళి అయేవరకు కష్టపడి తరువాత సుఖపడిపోతారు,...కృష్ణా అబ్బాయిలు పెళ్ళి అయేవరకు జల్సాలు చేసి తరువాత జీవితాంతం కష్టపడుతుంటారు.

గోదావరి అబ్బాయిలు అధికారంతో బంధిస్తారు, కృష్ణా అబ్బాయిలు ప్రేమతో బంధిస్తారు.

గోదావరి అబ్బాయిలు ఆరోగ్యంగా ఎక్కువ కాలం జీవిస్తే , కృష్ణా అబ్బాయిలు ఆనందంగా తక్కువ కాలం జీవిస్తారు.

గోదావరి అబ్బాయిలు స్త్రీలపై ఎక్కువగా ఆధారపడతారు,కృష్ణా అబ్బాయిలు స్వతంత్రంగా వారి పనులు వారు చేసుకుంటారు.

గోదావరి అబ్బాయిలలో చాలమంది బహుభార్యాత్వాన్ని కలిగి ఉంటారు(70,80 సం.లు వచ్చినా ఇంకా పెళ్ళి చేసుకుందామనే ఆలోచనలోనే ఉంటారు), కృష్ణా అబ్బాయిలు ఒక భార్యనే కోరుకుంటారు.(మా ఆయన మాత్రం ఏకపత్నీవ్రతుడే,అపార్ధం చేసుకుంటారేమో అని చెపుతున్నాను).

గోదావరి అబ్బాయిలు పొదుపరులు,ఎక్కువగా కష్టపడతారు, కృష్ణా అబ్బాయిలు ఎక్కువ ఖర్చులు చేసి తక్కువ కష్టపడతారు.

గోదావరి అబ్బాయిలకి ఆచారవ్యవహారాలన్నా,భార్యని తమ అదుపాజ్ఞల్లో పెట్టుకోవడమన్నా ఇష్టం, కృష్ణా అబ్బాయిలు భార్యని స్నేహితురాలిగా భావిస్తారు.

గోదావరి అబ్బాయిలు ప్రకృతి ప్రేమికులు వారే సొంతంగా తోటని పెంచుకుంటారు, కృష్ణా అబ్బాయిలు పార్కులని సందర్శించి తృప్తి పడతారు.

గోదావరి అబ్బాయిలు పొలాలు,తోటలు కొనటానికి ఇష్టపడతారు, కృష్ణా అబ్బాయిలు real estate business,బంగారం కొనడానికి ఇష్టపడతారు.

ఇక ఆనందించే విషయానికి వస్తే డబ్బు వచ్చే ఆటలు(cards,gambling,betting,shares) ఏవైనా గోదావరి వాళ్ళు ఇష్టపడితే, డబ్బులు పోగొట్టుకునే సినిమాలు,పర్యాటకాన్ని కృష్ణా అబ్బాయిలు ఇష్టపడతారు.

చివరిగా life challenging & romantic గా ఉండాలని కోరుకునేవారు గోదావరి వాళ్ళని చేసుకోవచ్చు, life smooth & pleasant గా ఎటువంటి వడిదుడుకులు లేకుండా ప్రశాంతంగా గడపాలనుకునేవారు కృష్ణా అబ్బాయిలని కోరుకోవచ్చు.

32 comments:

చిన్ని said...

అభినందనలు ....చాల చాల చక్కగా చెప్పారు ..కృష్ణా అబ్బాయిలు విషయంలో ఎక్కడ చిన్న పొల్లు కూడా పోకుండా చెప్పారు

Anonymous said...

ోదావరి అమ్మాయిలు.. క్రిష్ట అమ్యాయిల మధ్య కూడా రాయండి

సుజాత said...

ఈ స్టడీకి బేస్ ఏది ఏది ఏది?

మా ఇంట్లో గోదావరి అబ్బాయికి కాసిని గోదావరి పోలికలు, కాసిని కృష్ణా లక్షణాలు కనిపిస్తున్నాయి.

Indian Minerva said...

మరి ఒంగోలు వాళ్ళో?

anveshita said...

అదిగో మళ్ళీ!!!! :(

మళ్ళీ తుంగభద్ర వాళ్ళకి అన్యాయం చేశారు :( మేమేం పాపం చేశామండి?

సరదాకే లెండి. బాగా రాశారు...

నీహారిక said...

chinni gaaru,
Thanks.
anonymous gaaru,
see my previous post.
sujata gaaru,
from my own experience.
indian minerva gaaru,
I don't know about ongole people.

All of you Thank you very much.

నీహారిక said...

anveshita gaaru,

Thank you.

Anonymous said...

అమ్మాయిల గురించి కూడా వ్రాయండి

శ్రీనివాస్ said...

మరి ఒంగోలు వాళ్ళో? naadi same question

budugu said...

అటుచేసీ ఇటుచేసీ మీరు తేల్చిందేంటంటే, పెళ్ళి తర్వాత అధికారంతో భార్యని బందించేవాళ్ళు సుఖపడతారు, ప్రేమతో బంధించేవాళ్ళు కష్టపడతారని. భేష్. నేనూ అదే అనుకున్నా ;)

నేస్తం said...

నేను గోదావరి అబ్బాయిలు గోదావరి అమ్మాయిలు మీద రాద్దాం అనుకున్నా అప్పుడెప్పుడో :) బాగానే రాసారు కాని ఒక్క పోయింట్ మిస్ అయిపోయారు గోదావరి అబ్బాయిలకు పెళ్ళయ్యాక భావుకత పాళ్ళు శూన్యం అయిపోతాయి ..ఉదాహరణకు కరెంట్ పోయి డాబా మీద కూర్చుని ఆ వెండి వెన్నెల ,చందమామను చూస్తే ఏమనిపిస్తుందండీ అన్నామనుకో ,వచ్చేటప్పుడు మస్కిటో కోయిల్ తెమ్మన్నాను తెచ్చావా ముందు వెళ్ళి తీసుకురా అంటారు తప్ప కన్నెత్తి కూడా చూడరు..ఇంక మీరు చెప్పిన లక్షణాల్లో మా ఆయనలో కూడా క్రిష్ణా లక్షణాలు కొన్ని కనబడుతున్నాయి :) బాగా రాశారు

నీహారిక said...

anonymous gaaru,
http://ramyamgakutirana.blogspot.com/2009/10/vs.html
chudandi.

బుడుగు గారు,
భలే అర్ధం చేసుకున్నారు,ఇద్దరూ బంధిస్తారు ఒకరు అధికారంతో అయితే ఒకరు ప్రేమతో,ఏ రాయి అయితే ఏమిటి పళ్ళు ఊడకొట్టుకోడానికి,కష్టాలు common అన్నమాట,first half లో వస్తే ఏమిటి second half లో వస్తే ఎమిటి,ఆఖరికి శుభం card పడితే చాలు.మన తెలుగు వాళ్ళు శుభం card పడేలా చూసుకుంటారు,తమిళ్ వాళ్ళు tragedy అయినా భరిస్తారు.ఇపుడు బాగా అర్ధం అయిందనుకుంటాను.

ఎస్పీ జగదీష్ said...

థ్యాంక్స్ అండీ... గోదావరి అబ్బాయిల గురించి మంచి విషయాలు చెప్పారు.. ఇక మీదట పెళ్ళి చూపుల్లో మీ బ్లాగ్‌ని సర్టిఫికేట్ కింద వాడుకుంటాము.. కాని ఒక్క చిన్న విషయం.. మీరు చెప్పినట్టుగా నేనూ గోదావరి అబ్బాయినే గాని, ఇంకో భార్య గురించి ఎప్పుడూ ఆలోచించలేదు.. నన్ను నమ్మండి.. (వున్నవాళ్ళతోనే వేగలేకపోతుంటే మళ్ళా ఇంకొకళ్ళా...) సరదాకి అన్నాలెండి.. మంచి టపా...

మాలా కుమార్ said...

ఏమిటి మీరు క్రిష్ణ , గోదారులను ఈదుతున్నారు ?
వీటి తరువాత తుంగభద్ర , కావేరిలని ఈదుతారా ?
ఎంత నిజమో కాని చదవటానికి సరదాగా వుంది .మా ఆయినని ఎందులో వేయాలో తెలీటము లేదు . రెండు లక్షణాలు కనిపిస్తున్నాయి మరి !

'Padmarpita' said...

చాల చాల చక్కగా చెప్పారు....Its 100% correct....అభినందనలు!

నీహారిక said...

నేస్తం గారు,
ఇంతకు ముందు నేను వ్రాసిన గోదావరి అమ్మాయిలు v/s కృష్ణా అమ్మాయిలు చూడలెదనుకుంటా,మీరేమి చెపుతారో అని ఎదురుచూసాను.పెళ్ళి ముందు అయినా పెళ్ళి తరువాత అయినా గోదావరి అబ్బాయిలకి భావుకత అసలు ఉండదండి.

నీహారిక said...

జగదీష్ గారు,
మీకింకా 60 ,70 సం.లు రాలేదు కదా,అపుడు తప్పక రెండవ భార్య గురించి ఆలోచిస్తారులెండి.ఊరికె సరదాకి అన్నాను.ధన్యవాదాలు.

నీహారిక said...

పద్మార్పిత గారు,
మీరు గోదావరి వారేనా? ధన్యవాదాలు.

srujana said...

నేను పుట్టింది తెలంగాణా, మెట్టినిల్లు గోదావరి, పిల్లలేమో కృష్ణ...ఇదీసంగతి!!
చాలా బాగారాసారండీ!

కొత్త పాళీ said...

హ హ హ.
రగిలించాల్సిన నిప్పు రగిలించేసి పైగా నేను ప్రాంతీయ విభేదాలు పుట్టించేందుకు రాయట్లేదని సన్నాయి నొక్కులొకటి! :)
ఇంతకీ గోదవరోడు బెట్రా, కిష్ణావోడు బెట్రా అంటే, దేన్లోనూ మునక్కుండా, పైకి తేల్నోడు బెట్రంటాను! :)

మంచు పల్లకీ said...

గోదావరి అబ్బాయిలని మీరు తిట్టారొ పొగిడారో అర్ధం కాలేదు.. రెండూ వున్నా ఫైనల్ కంక్లూజన్ ఎమిటా అని ...

దోమల్ని కొట్టుకుంటూ కన్నా మస్కిటో కోయిల్ తొ వెన్నలని ఎక్కువ అస్వాదించవచ్చు అని గొదావరి అబ్బాయిల ఇడియా.. అర్ధం చేసుకొపొతే ఎలా..

@ నీహారిక "పెళ్ళి ముందు అయినా పెళ్ళి తరువాత అయినా గోదావరి అబ్బాయిలకి భావుకత అసలు ఉండదండి. " ఇది చాలా అన్యాయం.. అంత డైరెక్ట్ గా చెప్పేయడమే..

kiranmayi said...

అయితే నేను safe. ఆరవ అబ్బాయిని చేసుకున్నాగా? ఇప్పుడు నేను మీ పోస్ట్ ప్రింట్ చేసుకుని, రెండింటిని కలిపిన హైబ్రిడ్ ఎలా తయారు చేసుకోవాలో డిసైడ్ అయ్యి, ఆ పని మీద ఉంటా.

నీహారిక said...

సృజన గారు,
అయితే మీరు మూడు పోస్ట్ లు వ్రాయవచ్చు.
ధన్యవాదాలు.
కొత్తపాళీ గారు,
రగిలించానంటారా?అయితే ఎక్కడో ఏదో తప్పు చేసి ఉంటాను ఒప్పుకోవాల్సిందే.కానీ నేను చెప్పదలచుకున్నది మాత్రం ఏ దారైనా ఒకటే మునగకుండా తేలమనే.

మంచుపల్లకి గారు,
last sentence లో diclare చేసాను కదా,
ఎవరికి నచ్చిన వారిని పెళ్ళికి ముందే select చేసుకోమని,తరువత తూచ్ అనొద్దని నా ఉద్దేశ్యం.

కిరణ్మయి గారు,
ఆ పని మీదే ఉండండి.

నేస్తం said...

మంచు పల్లకి గారు నీహారిక గారు ఇంకో పోయింట్ కూడా మర్చిపోయారు..గోదావరి అబ్బాయిలు మాంచి మాటకారులు..ఇదిగో ఇప్పుడు పైన మీరు సమర్దించినట్లు సమర్దించేసుకుంటారు :)
నీహారిక గారు చదివాను అమ్మాయిల గురించి కూడా..చాలా చాలా బాగా రాసారు.. నాది పుట్టినిల్లు మెట్టినిల్లు కూడా గోదావరివైపే కాబట్టి క్రిష్ణా వాళ్ళ గురించి తెలియదు కాని పశ్చిమ గోదావరి వాళ్ళ కు అటు క్రిష్ణా వాళ్ల లక్షణాలు కొన్ని వస్తాయి ..అయితే మీరు గోదావరి అమ్మాయిలగురించి ప్లస్ పోయింట్స్ రాసి వదిలేసారు :) ..గోదావరి అమ్మాయిలు చాడీలు చెప్పడం లో సిద్దహస్తులు ..చక్కగా ఆశక్తిగా చెప్ప్తారు ..:) వ్యంగ్య అస్త్రాలు విసరడంలో ప్రవీణులు :) ఎదుటివాళ్ళకు అర్ధం అయ్యి కానట్ట్లు భలే చెణుకులు విసురుతారు వాళ్ళకు అర్ధం అయ్యేలోపుల వీళ్ళు ఎదురుగా ఉండరు :) ఉదాహరణకు మా అమ్మాయికి లౌక్యం తెలియదు భర్త ఎదురుగా నాలుగు పనులు చేసినట్లు నటించడం చేత కాక పనులన్నీ ముందే చేసుకుని అతను వచ్చేసరికి మంచం మీద పడుకోవడం దానికి అలవాటు ఎప్పుడు నేర్చుకుంటుందో అని అత్తగారంటే దానర్ధం వాళ్లమ్మాయిని అంటున్నట్లు కాదు కోడలిని దెప్పుతున్నట్లు నువ్వు అలా చేస్తున్నావని :)
అబ్బో ఒక పోస్ట్ అవుతుంది ..

నీహారిక said...

నేస్తం గారు,
మొత్తం అన్ని points వచ్చెసాయి.మీరు చెప్పింది నిజమే,నాక్కూడా అనుభవమే.

మంచు పల్లకీ said...

బయటంతా మాటకారులే కానీ , ఇంట్లొ మాత్రం గోదావరి అమ్మాయులు విసిరే చెణుకులు కి అర్దం ఎమిటా అని ఎప్పుడూ అలొచిస్తూనే వుంటారు.. అప్పటికీ తట్టకపొతే ..రిడిల్ డిస్కస్ చెసుకొవడానికి క్రికెట్ గ్రౌవుండులు ఎలాగూ ఉన్నాయి కదా.. :-)

cartheek said...

గోదావరి అబ్బాయిలు బోలెడంత తెలివి,బోలెడంత లౌక్యం,బోలిడంత పొగరు కలిగిన నల్లని కన్నయ్యలు,కృష్ణా అబ్బాయిలు కాస్తంత తెలివి, కాస్తంత లౌక్యం,కాస్తంత పొగరు కలిగిన నీలమేఘశ్యాములు.

hu nenu krishna abbayini

hu hu hu neanoppukonu neanoppukone :)
:)
memu boledantha thelivigala vaalaame.....

నీహారిక said...

సర్లెండి, మరీ బాధ పడకండి కార్తీక్ గారు,ఒప్పుకుంటున్నాను లెండి!!!

ఏకాంతపు దిలీప్ said...

దీన్ని ఖండిస్తున్నాను.

మొదటి భావ కవి దేవులపల్లి కృష్ణ శాస్త్రి గోదావరికి అటు రామచంద్రాపురం లో పుడితే, ఆ తరవాత గొప్ప భావ కవిత్వం రాసిన దేవరకొండ బాలగంగాధర తిలక్ గోదావరికి ఇటు తణుకులో పుట్టారు..

అంతెందుకండి... నేను కూడా గోదావరి జిల్లాలోనే పుట్టాను... గోదావరి అబ్బాయిలకి భావుకత్వం లేదని ఎలా తీర్మానిస్తారంట? అందులోనూ అసలు పెళ్ళికి ముందూ ఉండదు, పెళ్ళి తరవాత ఉండదూ అనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా...

మీకు కుదిరితే నాకన్నా గొప్ప భావుకుడు కృష్ణా జిల్లాలో ఎక్కడైనా ఉంటే వెతికి పట్టుకురండి... (కొంచెం ఎక్కువైందంటారా? అయినా పర్లేదు... :) )

నీహారిక said...

ఒప్పుకుంటున్నామండీ! తప్పయిపోయింది ఈసారికి క్షమించేయండి.

ఏకాంతపు దిలీప్ said...

కానీ మీరు పోలికలు అల్లిన విధానం బాగుంది.. :)

ఏకాంతపు దిలీప్ said...

"గోదావరి అమ్మాయిలు చాడీలు చెప్పడం లో సిద్దహస్తులు ..చక్కగా ఆశక్తిగా చెప్ప్తారు ..:) వ్యంగ్య అస్త్రాలు విసరడంలో ప్రవీణులు :) ఎదుటివాళ్ళకు అర్ధం అయ్యి కానట్ట్లు భలే చెణుకులు విసురుతారు వాళ్ళకు అర్ధం అయ్యేలోపుల వీళ్ళు ఎదురుగా ఉండరు :) ఉదాహరణకు మా అమ్మాయికి లౌక్యం తెలియదు భర్త ఎదురుగా నాలుగు పనులు చేసినట్లు నటించడం చేత కాక పనులన్నీ ముందే చేసుకుని అతను వచ్చేసరికి మంచం మీద పడుకోవడం దానికి అలవాటు ఎప్పుడు నేర్చుకుంటుందో అని అత్తగారంటే దానర్ధం వాళ్లమ్మాయిని అంటున్నట్లు కాదు కోడలిని దెప్పుతున్నట్లు నువ్వు అలా చేస్తున్నావని :)
అబ్బో ఒక పోస్ట్ అవుతుంది .."

నేస్తం గారూ ఆ వ్యంగ్యం విషయంలో ప్రపంచంలో అందరికన్నా గోదావరి అమ్మాయిలే టాపర్స్! ఒక టపా రాసేద్దురూ..