Tuesday, July 6, 2010

ఈ వానాకాలం నాకు ఎండాకాలం!!!!!!


B Sc లో ఉన్నపుడు బొటానికల్ లో ఊటీ, మైసూర్, బెంగుళూరు చూసాను. ఈసారి నార్త్ టూర్ కి వెళ్దామని ప్లాన్ చేయమని చెప్పాను.  కాశ్మీర్, ఢిల్లీ, మధుర చూసాం.  పెళ్ళి కాకముందు అడిగాను కాబట్టి తీసుకెళ్ళారు, లేకపోతే అది కూడా ఉండేది కాదు. నిజానికి తనకి ప్రయాణాలంటే ఇష్టం ఉండదు. ఇంటి దగ్గర ఉన్నట్లు అక్కడ కుదరదు కదా! పైగా సూట్ కేసులు మోయాలి, వెహికల్ వెదకాలి , హోటల్ లో తినాలి, ఇవన్నీ నాకవసరమా అని ఎప్పుడూ టూర్ కి ఒప్పుకునేవారు కాదు. నాకేమో ఎక్కడకైనా వెళ్ళాలని ఉండేది, తను రానని మొండికేస్తే ఎలా ఒప్పించేది?

టూర్ కి వెళ్ళాలని డిసైడ్ అయిన తరువాత ఎక్కడికి వెళ్ళాలి అన్న ప్రశ్న? నేనేమో అండమాన్ అండ్ నికోబార్ కి షిప్ లో వెళ్దామని అన్నాను, షిప్ లో నాలుగు రోజులా . అని రానంటే రానన్నారు, తీసుకెళ్ళపోతే మానేయమన్నాను. ఒక సంవత్సరం గడిచిపోయింది. గత వారం మమ్మల్ని బలవంతంగా డార్జిలింగ్, గాంగ్ టాక్ తీసుకెళ్ళారు. బాగా ఎంజాయ్ చేసాం.

అందరూ ఎండాకాలంలో హిల్ స్టేషన్ కి వెళ్తారు, మేము వానాకాలంలో బయలుదేరాం. వర్షాలు మొదలైయాయి, అక్కడ బాగా చలిగా ఉంటుందని మా ఆయన ఎన్ని రకాల ప్రిపరేషన్స్ చేయించారో చెప్పలేను !! ఒక్కొక్కరికి ఐదు చొప్పున ముగ్గురికీ 15డ్రెస్ లు, మూడు జతల షూలు, మూడు జతల చెప్పులు, తినటానికి స్నాక్స్, స్వీట్స్, కాజు, కిస్మిస్ , బాదం పప్పులు, పల్లీ చిక్కీ, ఖర్జూరం, బిస్కట్స్ ,రెండు గొడుగులు, మూడు లావు లావు స్వెట్టర్స్, దుప్పట్లు, పచ్చడి సీసా, కరివేపాకు పొడి, మిరియాల పొడి, ఉప్పు, పంచదార, బ్రూ పాకెట్ లు, జండూ బామ్, మోయిశ్చరైజర్ వగైరాలు.......ఆఖరిది Iron box (ఈ ఐడియా ఎవరికి వచ్చిఉండదు) వెరసి ముగ్గురు మనుషులకి ఆరు లగేజీలతో ఇండియన్ ఎయిర్ లైన్ ఎక్కేసాం. మిగతాది రేపు......

4 comments:

hanu said...

chala bagumdi anDi, rapaTi part twaraga raayamDi fans waiting ikkaDa

శ్రీ said...

భలే!

టిక్కెట్లకి డబ్బులిచ్చినా మీ ఆయన తీసుకు వెళ్ళడం లేదా ?

మీ ఆయనకి మా టీవీలో విహారి కార్యక్రమం చూపిస్తూ ఉండండి.

అండమాన్ కి మన బ్లాగర్ వెళ్ళి రాసిన టపా ఉంది, చాలా బాగుంటుందట. మీరు తప్పకుండా వెళ్ళండి.

భావన said...

హ హ హ ఒక చిన్న సంసారాన్ని సరిపడా కూడా తీసుకుని వెళ్ళేరన్న మాట. రెండు ఫొటోలు కూడా పెట్టవలసింది నీహారిక. మరిన్ని వివరాల కోసం చూస్తూ...

నీహారిక said...

hanu,
you are like my brother.so there is no gaaru. I will write soon.Thankyou.

Sri gaaru,

please give me the post url. I want to read. I really like to see andaman and nikobar.

bhavana,

you are my friend,so I removed gaaru,I am very lazy to put the photos,but I will try.
Thankyou.