Wednesday, July 7, 2010

యమః నగరి .....కలకత్తా పురి !!!

మొట్టమొదటి సారి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం చూడగానే ఎంత నచ్చేసిందో, ఎంత బాగుందో!!
లగేజీల సంగతి ఇంతకు ముందు పోస్టులో చెప్పాగా ఎలా మొయ్యాలా అని ఆలోచిస్తు, వాటిని చూస్తూ సిగ్గుపడుతున్నా, ఒక ట్రాలీ లాంటివి అక్కడ ప్రత్యక్షమైనాయి, హమ్మయ్య అని లగేజి అంతా వాటిల్లోకి ఎక్కించాము. తర్వాత వాటిని సెక్యూరిటీ లో చెక్ చేయించి కార్గోలో పంపించి,లాంజ్ లో కూర్చున్నాం. అక్కడికి మాలాగే LTC TOUR వాళ్ళు కొంతమంది కలిసారు.International airline planes బాగుంటాయేమో కాని మేము ఎక్కిన కలకత్తా విమానం మాత్రం ఎర్రబస్సులానే ఉంది. ఇక ఎయిర్ హోస్టెస్ లయితే అమ్మమ్మల్లాగా ఉన్నారు, ఇంత కంటే అందమైన ఆంటీలు దొరకరేమో!!
రాత్రి 9 గంటలకు కలకత్తాలో దిగాం. ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు నేమ్ బోర్డ్ తో స్వాగతం చెప్పి హోటల్ కి తీసుకెళ్ళారు. కలకత్తా చూడగానే నరకం గుర్తుకు వచ్చింది. ఆ రాత్రి నిద్ర పోవాలన్నా భయం వేసింది. ఆ హోటల్ బాలేదు, ఆ కలకత్తా బాలేదు. కలకత్తా గురించి విన్నాను గానీ ఇంత చెత్తగా ఉంటుందని ఊహించలేదు. ఎక్కడ చూసినా పాత పాత భవనాలు, దేనికీ రంగులు ఉండవు, రోడ్లు శుభ్రంగా ఉండవు, ఎక్కడ చూసినా బురద, ఒక్కళ్ళు కాకపోతే ఒక్కరన్నా ఇంటిని శుభ్రంగా ఉంచుతారేమో అని చూసాను, కనుచూపు మేరలో ఎక్కడా ఒక అందమైన బిల్డింగ్ కూడా కనపడలేదు. అంతా అపరిశుభ్రం, పేదరికం, చేపల వాసన, మార్కిష్టులు 20 సంవత్సరాలు పాలించిన కేపిటల్ సిటీకే ఈ దుర్గతి. కలకత్తాని బాగుచేయాలంటే ఎవరో ఒక దేవుడు దిగి రావల్సిందే. మదర్ ధెరిస్సా కలకత్తా నెందుకు ఎంచుకుందో నాకిప్పుడు బాగా అర్ధం అయింది. ఇంత అపరిశుభ్రవాతావరణం లో రోగాలు, రోగులు ఉండకేం చేస్తారు.


మరుసటి రోజు విక్టోరియా మెమోరియల్ , రామక్రిష్ణ మ్యూజియం,

కలకత్తా కాళీ టెంపుల్, హౌరా బ్రిడ్జ్ చూసాం.


కాళీ దేవాలయం దగ్గర పూజారులు  దోచేసారు. బయటకి వస్తే కాళ్ళ వెంబడి జనం అడుక్కునే వాళ్ళు మనల్ని పరిగెత్తిస్తారు. దెబ్బకి భయపడి పోయి అందరికీ కాళీ టెంపుల్ కి వెళ్ళవద్దు అని చెప్ప్తున్నారు, మీకిష్టం లేకపోతే మానేయండి కానీ ఇతరులని వెళ్ళొద్దారేమిటి అని అన్నాను.అప్పటికి మద్యాహ్నం 12 గంటలకు మమ్మల్ని ఎయిర్ పోర్టులో దింపేసారు. మ 1 గం కి బాగ్ డోగ్రాకి ఫ్లయిట్ ఎక్కాం, రెండు గంటలకి బాగ్ డోగ్రాలో వెహికల్ రెడీ గా ఉంది. అది ఎక్కి గాంగ్ టాక్ బయలు దేరాం. అసలు ప్రయణం అంటే ఇదే!! అందమైన కొండలు, మధ్యలో తీస్తా నది, ఎత్తైన చెట్లు, పైగా వర్షం, మన మధ్యనే మేఘాలు....ఓహ్...ఎంత అందమీ ప్రకృతి అనిపిస్తుంది...

మరిన్ని అందాల గాంగ్ టాక్ కబుర్లతో మరొకరోజు....

7 comments:

భావన said...

అదేంటండి యమహా నగరి కలకత్తా పురి అని అంటే నిజమనుకున్నా. ఆ యమహా కు వేరే అర్ధమన్నమాట. :-( .... రామకృష్ణుల ఆశ్రమం చూడలేదా.. చాలా బాగుంటుంది అట కదా. గాంగ్ టాక్ ఫొటోలు బాగున్నాయి. నిజమే్కదా మనమధ్యన మేఘాలు తేలి, కళ్ళమీదుగా మనసును చేరుకుని మనలను కూడా అలా ఆకాశం లో ఎగిరేట్టు చేస్తాయి... నా మనసు ఆ పూచిన దేవదారు కొమ్మ ల చెట్ల అంచున మేఘాలతో చిక్కడి పోయింది తీసి ఇవ్వవా నా ప్రాణ సఖా అని శ్రీవారిని అడగొచ్చు కూడా...(ఆ తరువాత నాలుగు తిట్లు కూడా తినొచ్చు అనుకోండి వెర్రి మాటలు ఆపు అని ;-))

బ్లాగాగ్ని said...

నీహారిక గారు, చాలా బాగున్నాయండీ మీ అనుభవాలు. నాక్కూడా నార్త్ ఈస్ట్ సందర్శించాలని ఎప్పట్నించో కోరిక. మిగతా వివరాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటాను. పనిలో పనిగా మీకు ప్రయాణం, వసతి ఏర్పాట్లు చేసిన ట్రావెల్ ఏజన్సీ వివరాలు, సిక్కింలో ఉన్న హోటల్ వివరాలు వంటివి కూడా వ్రాస్తే మాలాంటి వాళ్ళకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

కమల్ said...

వావ్... గ్యాంగ్‌టాక్ ప్రకృతి రమణీయ అందాలు బలే ఉన్నాయండి...బాగ బందించారు మీ కెమెరాలో..! నిహారిగ గారు.

మాలా కుమార్ said...

నన్ను 1974 లొకి తీసుకెళ్ళారు . ఫొటోలు బాగున్నాయి .

నీహారిక said...

భావన,
రామకృష్ణ ఆశ్రమం చూసాము కానీ photos తీసుకోనివ్వలేదు. అందుకే పెట్టలేదు.
బ్లాగాగ్ని గారు,
గాంగ్ టాక్ గురించి చాలా చెప్పాలి.హోటల్స్ గురించి ట్రావెల్ ఏజెన్సీ గురించి తరువాత పోస్టులో వ్రాస్తాను.
తప్పక ప్లాన్ చేయండి.చూడాల్సిన ప్రదేశం.
కమల్ గారు,
ఇంకా ఉన్నాయి.next post తప్పక చదవండి.
మాలా గారు,
మీరు కలకత్తా గురించి అన్నారా? గాంగ్ టాక్ గురించి అన్నారా?

sunita said...

eppaTinunchoe idoka penDing project naaku. sikkim, daarjiling. eppaTiki choostaanoe? phoeto's baagunnaayi.

నీహారిక said...

suneeta gaaru,

Don't miss sikkim.It's wonderful place.