Tuesday, July 13, 2010

గాంగ్ టాక్ అందాలు

గాంగ్ టాక్ కి వెళ్ళాలంటే రైలు మార్గం ద్వారా గాని, విమాన మార్గం ద్వారా బాగ్ డోగ్రా చేరుకోవాలి. అక్కడి నుండి గాంగ్ టాక్ కి 126Km దూరం,నాలుగు గంటల ప్రయాణం. నాలుగు గంటలు ఎట్లా గడిచిపోతాయో తెలియదు దారంతా దట్టంగా పరుచుకున్న అడవులు, మద్యలో తీస్తానది, మనమీదనే ప్రయాణించే మేఘాలు మనల్ని మైమరిపిస్తాయి.

                                                       మేఘాల సోయగం -- గాంగ్ టాక్


కలకత్తా చూసిన తరువాత  గాంగ్ టాక్ చూస్తే మనకు నరకం నుండి స్వర్గం లోకి వచ్చినట్లు అన్పిస్తుంది. కలకత్తా లో చెత్త హోటల్ ఇచ్చాడని చెప్పాగా ఆ ట్రావెల్ ఏజెన్సీ అతనిని పిలచి, నువ్వు మాకు తిండి పెట్టక పోయినా పర్లేదు(ఒక బేగ్ నిండా తినేవి ఉన్నాయి కదా!!!) మాకు రూమ్ మాత్రం మంచిది ఇవ్వు అని అరిచారు. పాపం, స్పేస్ లింక్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఏజెంట్ మంచి వాడు మమ్మల్ని ఆ తర్వాత ఇబ్బంది పెట్టలేదు.హోటల్ స్నో లయన్ లో వసతి ఏర్పాటు చేసారు. రాత్రికి హోటల్ చేరుకున్నాం.

కలకత్తా సముద్రానికి దగ్గరలో ఉంది కాబట్టి ఎపుడు తేమగా ఉంటుంది, అందుకే ఇళ్ళకి రంగులు నిలవవు అని రంగులు వేసుకోరనుకుంటా? కానీ మనసుంటే మార్గముండక పోతుందా? గాంగ్ టాక్ లో కూడా వాతావరణం ఎప్పుడూ చల్లగానే ఉంటుంది, ఎపుడు వర్షం వస్తుందో, ఎపుడు ఎండ వస్తుందో తెలియదు. అక్కడ వాళ్ళు ఒక పరిష్కారమార్గం కనుగొన్నారు, అదేమిటంటే ఇళ్ళకి, గోడలకి oil paints వేయడం. అసలు సిక్కిం అంటేనే colourful అన్నమాట, అక్కడ అన్ని ఇళ్ళు ఎంతో అందంగా, కలర్ ఫుల్ గా, ఆయిల్ పెయింట్స్ తో, చక్కటి designs తో ఎంతో అందంగా ఉంటాయి. మాకిచ్చిన రూమ్ ఎంతో బాగుంది.


                               అక్కడ గోడలకు రంగు రంగుల పెయింటింగ్స్ వేస్తారు

                                                        రమ్ టెక్ ముఖద్వారం
  ఇక భోజనం అయితే చపాతీలు ఎక్కువగా దొరుకుతాయి, మేము ఇక్కడ కూడా చపాతీలు తింటాము కాబట్టి మాకు ఇబ్బంది కాలేదు, అడిగితే రైస్ కూడా చేస్తారు, పప్పు శనగ పప్పుతో చేస్తారు, కానీ పెరుగు మాత్రం దొరకదు. ఇకపోతే మేం పట్టుకెళ్ళిన పచ్చడి, కరివేపాకు పొడి ఎలానూ ఉంది.

  మర్నాడు ప్రొద్దున్నే లేచి బట్టలు ఇస్త్రీ చేసుకుని, తడిచిన టవల్స్ కూడా ఇస్త్రీ చేసుకుని ఆరేసి టిప్ టాప్ గా తయారయ్యి, చపాతీ ఆలూకర్రీ తో టిఫిన్ తిని ఇండియా టిబెట్ బోర్డర్ దగ్గర ఉన్న నాధులా పాస్, బాబా మందిర్(Tsongo-Babamandir/Nathula Pass) చూడటానికి బయలు దేరాం

                                                            బాబా మందిర్  - నాధులా  - గాంగ్ టాక్

     దారిలో ఎంతగా ఎంజాయ్ చేసామో!! అసలు అందరూ హిల్ స్టేషన్ కి మంచుకురుస్తున్నపుడు వెళ్తారు. కానీ మేము రెండు సార్లూ(కాశ్మీర్ ఆగష్టులో, ఇపుడు జూన్ లో) వర్షాకాలం లోనే చూసాం. హనీమూన్ కెళ్ళినపుడు  నేను విజయవాడ నుండి కాశ్మీర్  కెళితే చలికి తట్టుకోలేకపోయాను, ఇపుడు హైదరాబాద్ లో చలి అలవాటయింది కాబట్టి పర్వాలేదు బాగానే తట్టుకోగగలిగాం. మరీ మంచులో అయితే చలికి తట్టుకోవటం కష్టం, నాకయితే ఇపుడే బాగుంది.ఇపుడు అక్కడ వాళ్ళకి సమ్మర్ ప్రొద్దున్న నాలుగు గంటలకే తెల్లవారిపోయేది. దారిలో వర్షం, మేఘాలు కలగలిపి ఉన్నాయి. అక్కడ దిగిన ఫోటోస్ బాగా వచ్చాయి.
  గాంగ్ టాక్ అందాలు                                          చాంగు లేక్  - నాథులా - గాంగ్ టాక్
                                                             చాంగు లేక్ - గాంగ్ టాక్
  నాథులా పాస్ దగ్గరకి వెళ్ళాలంటే రెండు పాస్ పోర్ట్ ఫొటోస్, మనం ఇండియన్స్ అని తెలియపరిచే ఐడెంటిటీ కార్డ్ తీసుకెళ్ళాలి. బుధ,గురు,శుక్ర,శని మరియు ఆదివారాల్లో వెళ్ళాలి. అక్కడ చాంగు లేక్ (tsongo lake) 12400 అడుగులు,బాబా మందిర్ 13000 అడుగులు, నాథులా14,600 అడుగుల ఎత్తున ఉన్నాయి. నాథులా పాస్ అంటే ఇండియా నుండి టిబెట్ కి వెళ్ళే దారి, అదిప్పుడు మూసివేయబడింది. భవిష్యత్తులో చైనా తో వ్యాపార సంభందాలు ఏర్పడితే తెరవవచ్చు అని అంటున్నారు.
  బాబా మందిర్ నాథులా కెళ్ళే రోడ్ లో ఉంది. ఎంతో మంది ఈ మందిర్ ని తమ కోరికలను తీర్చే గుడిగా భావిస్తారు. అక్కడకి బోటిల్ లో నీళ్ళు తెచ్చుకుని అక్కడ వదిలి మళ్ళీ తమతో  తీర్ధం లా తీసుకెళ్తారు. ఆదివారం అక్కడ ఉచితంగా భోజనం పెడ్తారు.
                                                       బాబా హర్భజన్ సింగ్ - గాంగ్ టాక్  బాబా హర్బజన్ సింగ్  అనే సోల్జర్ తన బెటాలియన్ లోని కంచర గాడిదలను తీసుకెళ్తుండగా మంచులో కూరుకుపోయి చనిపోయినట్లు చెపుతారు. అతని ఆత్మ మిగతా జవానులకు దారి చూపించిందట, అతని శరీరాన్ని కనుగొనటానికి మూడు రోజులు పట్టిందట. తరువాత అక్కడి జవాన్లకు బాబా కనపడినట్లు అక్కడే తిరుగుతున్నట్లు అనిపిస్తుంది, దాంతో వాళ్ళు అక్కడే అతని సమాధిని ఏర్పాటు చేసారు. ఆయన జ్ఞాపకంగా ఏర్పాటు చేసిన ఆ సమాధిలో రోజూ రాత్రి  అక్కడికి బాబా వస్తున్నట్లు,అతని యూనిఫాం వేసుకుంటారని, అతని బూట్లు తెల్లారేసరికల్లా బురదతో నిండి ఉంటాయని తెలిపారు. ప్రతి సంవత్సరం సెప్టెంబరు 14 న బాబా ఆన్యువల్ హాలీడే తీసుకుని తన స్వస్థలానికి వెళ్తారని, అపుడు అక్కడి వారు ప్రార్ధనలు చేసి  పూలతో వీడ్కోలు చెపుతారని, ఒక బెర్త్ కూడా అతని పేరు మీద రిజర్వ్ చేస్తారని, ఇద్దరు జవాన్లని అతనితో పంపుతారని, అతని తల్లికి నెల నెలా కొంత జీతం కూడా ఇస్తారని తెలిపారు.  ఆ మధ్య జరిగిన ఇండో చైనా యుద్ధానికి మూడు రోజుల ముందు గానే అక్కడి జవాన్లని సమాయుత్త పరిచాడని తెలిపారు.

  అక్కడ యాక్ లు,గుర్రాలు,గాడిదలు కనిపించాయి
  అసలు హిల్ స్టేషన్ కెళ్తే చూడడానికి వెళ్ళకూడదు. కనీసం ఒక వారమయినా ఉండటానికి వెళ్ళాలి. మేము గాంగ్ టాక్ లో రెండు రోజులు మాత్రమే ఉన్నాం. అన్నిటినీ చూడడానికి సమయం సరిపోలేదు. గాంగ్ టాక్ లో ముఖ్యంగా చెప్పుకోవలిసింది బుద్ధుని ఆలయాలు. టిబెట్ కి దగ్గరగా ఉండటం వల్లనేమో అక్కడ మొనాశ్ట్రీస్ ఎక్కువగా ఉన్నాయి. Monastrys గురించి మరొక రోజు రాస్తాను.(సుత్తి కొడుతున్నా కదూ!!! నేనేదయినా చెప్పాలనుకుంటే అవతలి వాళ్ళు వినేదాకా చెప్పకుండా వదలను, వద్దు బాబోయ్ వదిలేయ్! అన్నా వినను. ఒదలను బొమ్మాళీ మిమ్మొదల!!!!!)

  11 comments:

  sunita said...

  చాలా బాగున్నాయండి ఫోటోలు . మరీ ఆ పెయింటింగులైతే కళ్ళు చెదిరేంత అందంగా ఉన్నాయి.

  Anonymous said...

  మీరు కేంద్రప్రభుత్వ ఉద్యోగులనుకుంటా.LTC లొ NORTH EAST INDIA TOUR లొ గాంగ్ టాక్ బాగా enjoy చెసివుంటారు.

  నేస్తం said...

  గాంగ్ టాక్ చాల బాగుంటుందని విన్నాను..భలే మంచి పొటోస్ పెట్టారు ..చాలా బాగుంది హొటెల్ రూం అయితే... చాలా బాగా రాసారు..ఇంకా ఎక్కువ రాయండి ..ఇలాంటివి వినడం చాలా బాగుంటుంది.. :)

  నేస్తం said...

  చాలా పోస్ట్లు వ్రాసారు..ఈ మద్య నెట్ చూడటం లేదు ..మిస్ అయ్యాను.. భలే ఓపికగా పెట్టారు పొటోస్ ..కలకత్తా అంత భయంకరంగా ఉంటుందా..అయ్యో ..హ్మ్మ్మ్

  నీహారిక said...

  సునీత,
  ఫోటోస్ system లో ఇంకా బాగున్నాయి. నా బ్లోగ్ లో ఇలానే వచ్చాయి. I am not satisfied.
  Thank you.

  Anonymous gaaru,

  మీరు నీ జతలోనా ...పోస్ట్ చదవండి.
  Thank you.

  నేస్తం,
  మీరు చూడలేదని మీకు mail చేద్దామని అనుకున్నాను. మీ mail address తెలియదు.

  Thank you.

  భావన said...

  చాలా బాగున్నాయి ఫొటో లు. ప్రకృతి కి మించి చూడవలసిన అధ్బుతాలు ఏమి వుంటాయి కదా. ఆ పొగమంచు చిత్రాలు, సరస్సు అద్దం లో మొహం చూసుకుంటున్న మబ్బులు...నీటి మేఘాలు వొరుసుకుంటున్న నది వొడ్డున చలి కి సన్నగా నైనా వణుకుతూ అక్కడ తిరిగిన గొప్ప వారిని తలచుకోవటం.. అధ్బుతం నీహారిక. I am so glad you made that trip and sharing the info with us.
  మీ హోటల్ రూమ్ ఆ ఆయిల్ పెయింటింగ్స్ కూడా చాలా బాగున్నాయి.

  శ్రీ said...

  భలే ఉన్నాయండీ మీ టూర్ విశేషాలు

  నీహారిక said...

  భావన,
  మీరు ఇలాగే వ్రాస్తుండండి. నేను సరిగా వర్ణించలేకపోయినది మీరు చెపుతుంటే నాకు చాలా ఆనందంగా ఉంది.
  Thank you.

  శ్రీ గారు,
  ఫోటోస్ నచ్చాయా? అయితే గాంగ్ టాక్ కి ప్లాన్ చేయండి. ధన్యవాదాలు.

  3g said...

  మీ టూర్ విశేషాలు బాగున్నాయండి. నాక్కూడా అక్కడికివెళ్ళాలని ఉంటుంది చూడ్డానికి కాదు ఉండిపోవటానికి. అక్కడ కొన్ని చోట్ల ఎప్పుడూ వర్షం పడుతూనేఉంటుందటకదా....... నాకు అలా పచ్చని చెట్లమీద వర్షం పడుతుంటే ఎంతసేపైనా చూస్తూనేఉండాలనిపిస్తుంది.

  నీహారిక said...

  3g gaaru,

  Thankyou.

  మాలా కుమార్ said...

  గాంగ్ టాక్ ఫొటోస్ చాలా బాగున్నాయి .

  మేము కలింగ్ పాంగ్ వరకూ రెండుసార్లు వెళ్ళాము . అదేమి శాపమో , గాంగ్ టాక్ వెళుదామని వెహికిల్ తిప్పగానే మా పిల్ల లో ఎవ్రో వకరికి మీజిల్స్ , ఫెవెర్ వచ్చేసేవి . దాని తో వెనక్కి , సిలిగురి వెళ్ళి పోయాము . రెండు సార్లూ అంతే అయ్యింది . ఆ తరువాత వీలు కాలేదు . ఎప్పుడూ , ఇప్పటికీ , నేను మిస్సైన గాంగ్ టాక్ , రాజస్తాన్ల గురించి అనుకుంటూ వుంటాను .