Tuesday, November 23, 2010

లెస్బియన్ లు, గే లు, హోమో సెక్సువల్ ల హక్కులు కాపాడటం ఎలా?

ఈ భారతదేశ అభివృద్ధికి  ఆటంకాలుగా భావిస్తున్న అవినీతి, క్రోనీ కాపిటలిజం, అతివాద హిందూత్వ విధానాలు కాకుండా పైకి కనిపించకుండా వేధిస్తున్న కారణాలు రెండు ఉన్నాయి. అవి ఒకటి ఎల్‌జిబిటి(లెస్బియన్, గే, బైసెక్సువల్ & ట్రాన్స్‌జెండర్) మరియు లైంగిక హక్కుల పోరాటాలు, రెండు మావోయిష్టులు, ఉగ్రవాదులు, తీవ్రవాదుల పోరాటాలు.

ముందుగా  వీరు ఎవరు? ఎలా తయారయ్యోరో చూద్దాం. ఎల్‌జిబిటి(లెస్బియన్, గే, బైసెక్సువల్ & ట్రాన్స్‌జెండర్) లు అంటే వీరు  అతి "ప్రేమ" తో బాధ పడేవారు. ఉగ్రవాదులు, తీవ్రవాదులు మొదలైన వారు అతి "ద్వేషం" తో బాధ పడే వారు. అతి "ప్రేమ" అంటే కనిపించిన ప్రతి వారినీ ప్రేమిస్తారన్నమాట! అతి "ద్వేషం" అంటే కనిపించిన ప్రతి వారినీ ద్వేషిస్తారన్నమాట! ఇద్దరిలోనూ "అతి" ఎక్కువగా ఉండటం వల్ల ఈ సమాజానికి నష్టం కలుగుతుంది.


ఈ అతి ప్రేమతో బాధ పడే స్త్రీలతోనూ, పురుషులతోనూ కష్టమే. స్త్రీలనైతే "లెస్బియన్" లంటారు, పురుషులనైతే "గే" లంటారు. కొద్ది ప్రేమనైతే తట్టుకోవచ్చు, ఉప్పెనంత ప్రేమని గుప్పెడంత గుండె తట్టుకోగలదా?  పోనీ వారు వారి భాగస్వాముల్ని మాత్రమే ప్రేమిస్తే పర్వాలేదు, కనిపించిన ప్రతివార్నీ ప్రేమిస్తుంటే ఏ భార్య/భర్త మాత్రం తట్టుకోగలరు.

"ద్వేషం"తో రగిలే వారిని ఆపవచ్చు, కానీ "ప్రేమ" తో రగిలే వారిని ఆపటం కష్టం.

ఈ ప్రపంచం లో ప్రతి మనిషికి తన ఇష్టానుసారం బ్రతికే హక్కు కల్పించాల్సిందే, కాదనడానికి ఎవరికీ హక్కు లేదు. పైగా అతి ప్రేమతో బాధ పడే వీరికి ఇతరులలో ఆ "అతి" లేనందువల్ల తమ హక్కులను ఎవరో లాగేసుకున్నట్లు ఫీలవుతారు. నిజానికి ఎవరూ ఏమీ అనక పోయినా మా హక్కులు ఎందుకు లాక్కుంటున్నారు అని వీరికి వీరే ఫీలవుతూ, వాళ్ళని వాళ్ళే కించపరుచుకుంటూ మమ్మల్ని మీతో కలుపుకోండి, మా హక్కులు లాక్కోకండి అని తెగ వాపోతుంటారు.

అతి ద్వేషులు కూడా "దేశభక్తులే" కానీ అతి ద్వేషంతో వారు కూడా బాధ పడుతున్నారు. ప్రపంచం అంతా ద్వేషంతో నిండిపోయింది,  అందరూ దోపిడీ దారులే అని వీరు భావిస్తారు. వీరు ఎక్కువగా ధనవంతులను, రాజకీయనాయకులను, పోలీసులను ద్వేషిస్తుంటారు. వీరు సామాన్యంగా అడవులలోనూ, తండాలలోనూ తిరుగుతుంటారు. వీరు కూడా తమ హక్కుల కోసం పోరాడుతూనే ఉంటారు.


"లెస్బియన్" లు "గే"లను  ఈ సమాజం నుండి వెలివేయకుండా , అసహజ పద్దతులవల్ల హెచ్ ఐ వి లాంటి ప్రమాదకర వ్యాధులు వస్తాయని వారికి తెలియజేయడమే కాకుండా( సహజ "అరక్షిత" విధానాల వల్ల కూడా వస్తాయనుకోండి)   కొన్నాళ్ళు  అంటే ఒక సంవత్సరమో లేక రెండు సంవత్సరాలో వారిని విడిగా బ్రతికేలాగా ఏర్పాటు చేయాలి.

"లెస్బియన్" (ఆడ స్వామినులు కూడా)  లైతే కేరళకి , "గే" (స్వామీజీలు, బాబాలు కూడా) లైతే హిమాలయాలకు పంపాలి. సహజీవనం చేయాలనుకునే వారిని "గోవా"లో స్వేచ్చగా వివస్త్రలై జీవించే హక్కు కల్పించాలి. అలా కొన్ని రోజులు వారు విడిగా అక్కడ గడిపిన తరువాత వారికి జీవితం అంటే ఏమిటి? ఎందుకు పుట్టాం? ఏం సాధించడానికి ఈ లోకానికి వచ్చాం? అనేది వారికి స్వయంగా అనుభవం లోకి వస్తుంది.

అలా విడిగా కొన్నాళ్ళు ఉన్న తరువాత వారికి మనుష్యుల విలువ తెలుస్తుంది. ఏ మనిషినీ "అతి" గా హింసించకూడదని, "అతి" అనేది జీవితానికి సరిపడదని, మానవ సంబంధాలు సున్నితమైనవని, అవి అసహజ పద్దతుల ద్వారా సాధించకూడదని తెలుస్తుంది. ఒక "స్త్రీ"  ఇంకొక "స్త్రీ" ని ప్రేమించలేదు, ఒక "పురుషుడు" మరియొక "పురుషుడి"ని ప్రేమించలేడు.  వారిద్దరి మధ్య "ప్రేమ" పుట్టదు. అక్కడ "ద్వేషమే" కానీ ప్రేమ పుట్టదు అని తెలుసుకుంటారు.

అపుడు వారు పరిపూర్ణ వ్యక్తులుగా మారి మళ్ళీ ఈ జనజీవన స్రవంతి లో   కలిసిపోతారు. కాబట్టి  వారిని ద్వేషించకుండా వారిని ఆయా చోట్ల బ్రతికేలాగా ఏర్పాట్లు చేసి వారి మనసిక సమతౌల్యానికి కృషిచేయాలి.

11 comments:

తార said...

>>అతి" అనేది జీవితానికి సరిపడదని

బాగా చెప్పారు కొన్ని పాయింట్లు, పూజా భట్ ఇప్పుడు పెద్ద శివ భక్తురాలు ఐనట్టుగా, మోతీలాల్ చనిపొయేముందు గాయత్రీ మంత్రం వినాలని ఉన్నది అన్నాడట అలా..

durgeswara said...

వెల్

నైమిష్ said...

నీహారిక గారు చాలా బాగా చెప్పారు ..మీతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను..

Shiva Bandaru said...

నేనుకూడా పూర్తిగా ఏకీభవిస్తున్నాను..

సవ్వడి said...

good...

parishkaaraalu kudaa ceppaaru.

Anonymous said...

Good Post.

నీహారిక said...

తార గారు, దుర్గేశ్వర గారు,నైమిష్ గారు, శివ బండారు గారు,సవ్వడి గారు, అనానిమస్ గారు ధన్యవాదాలు

నీహారిక said...

Indian Minerva Gaaru,

Ok, just ignore them.

Ramakrishna Reddy Kotla said...

I Appreciate your attempt on this sensitive issue. But the usage of word "prema" is not justified and misused i guess, though you emphasized it as "athi prema". The term has much wider meaning and should not be confined to some perverted activities like L.G.B.T. It is not becaused of "over love", it is because of "over lust" and "mental indifference".

Anonymous said...

*పూజా భట్ ఇప్పుడు పెద్ద శివ భక్తురాలు ఐనట్టుగా*

తారా, నీకు పూజా భట్ గురించి ఎమి తెలుసో ఎంత తెలుసో నాకు తెలియదుగాని. మహేష్ భట్ గారి గురువు పేరు యు.జి. కృష్ణమూర్తి అని ఒకరు ఉన్నారు. ఆయన గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఆయన గొప్ప యోగి. నా వరకైతే ఆయన లాంటి రెవల్యుషనరి గురువి ఇప్పటివరకు నాకు తారసిల్ల లేదు. ఆయన తెలుగు వారు. G. చలం గారికి దూరపు బంధువు. మీకు తెలియకుటే ఒకసారి ఆయన గురించి చదివండి. అటువంటి గొప్ప యోగి సానిధ్యం లో పూజా భట్ చిన్నతనంలో కొన్ని రోజులు విదేశాలలో గడిపింది. అసలికి అటువంటి వారిని కలవటమే చాలా మందికి వీలు పడదు. ప్రాప్తం ఉండాలి. మీరు ఎదో పేపర్లో ఆమేను గురించి మసాలాలు చదివి ఎదేదో ఊహించు కొంట్టునట్లు ఉంది

Anonymous said...

పూజా భెడీ ని పూజా భట్ గా అనుకున్నారేమో తారా!