Thursday, December 2, 2010

వృద్ధాప్యం కారాదు అభిశాపం!!!

అందరికీ పుట్టిన రోజు అంటే ఎంతో అభిమానం. ఎంతో ఘనంగా పండుగ జరుపుకుంటారు. కానీ వృద్ధాప్యం లేదా మరణం అనేసరికి అందరికీ భయమే. జననాన్ని ఎలా అయితే ఆహ్వానిస్తున్నామో మరణాన్ని కూడా అంతే సాధారణంగా ఆహ్వానించాలి.

వృద్ధాప్యంలో  ఆరోగ్య సమస్యలే కాకుండా వేధించే సమస్య భాగస్వామి మరణం. స్త్రీలైతే భాగస్వామి మరణించినా ఎలాగయినా బ్రతకగలరు. పురుషులు అలా బ్రతకగలగటం కష్టం. భాగస్వామి లేకపోయినా ఏ సహాయం లేకుండా బ్రతికేవారు ఉన్నారు వాళ్ళనుద్దేశ్యించి ఈ పోస్ట్ వ్రాయటం లేదు. మెజారిటీ పురుషులు ఇంటి పనులు చేసుకోవడం కష్టం కాబట్టి వారు పునర్వివాహం చేసుకున్నా తప్పు లేదని మన పూర్వీకులు నిర్ధారించారు. అలాగే  చాలా మంది పునర్వివాహం చేసుకుంటున్నారు. ఇది అన్ని మతాలలోనూ ఉంది. నిన్న ఒక పోస్టులో ముస్లిం అరబ్బులు  చిన్నపిల్లలను పెళ్ళి చేసుకున్నారని ఆరోపించారు. వారు పెళ్ళి చేసుకున్నారు అని అంటున్నారు కానీ అంత చిన్నపిల్లలను తల్లితండ్రులు ఎందుకు ఇవ్వాల్సివచ్చింది? పేదరికమే దానికి కారణం. వృద్ధులను  చూసుకోడానికి ఎవరూ ముందుకు రాని సంధర్భంలో వారు పునర్వివాహం చేసుకోవలసి వస్తుంది. ఇచ్చే వాళ్ళున్నపుడు చేసుకోడానికి వారికి అభ్యంతరమేముంది? అందుకే చేసుకుంటున్నారు. అలా ఆవేశం తో పోస్టులు రాయటం కాదు ఆలోచన చేయాలి. వారిని చూసుకునే వారుంటే వాళ్ళు ఎందుకు మళ్ళీ పెళ్ళి చేసుకుంటారు?

నా స్వీయానుభవంతో చెపుతున్నాను, గోదావరి జిల్లా లో ఎవరి భార్యైనా చనిపోతే అక్కడి స్త్రీలే స్వయంగా  కన్యని వెతికి మరీ పెళ్ళీ జరిపిస్తారు. ఈ విషయంలో మాత్రం ఏకాభిప్రాయం ఉంటుంది వాళ్ళకి. అందరికీ అమితాబ్ నటించిన "చీనీ కం"  సినిమా నచ్చుతుంది. అదే విషయం నిజజీవితంలో జరిగితే నచ్చదు. సెలెబ్రిటీ లు ఏం చేసినా పర్వాలేదు.  కానీ నిజ జీవితంలో జరిగితే తట్టుకోలేరు. వృద్ధాప్యం లో నే అసలు తోడు కావలిసింది. చిన్నవాళ్ళను చేసుకోవడం తప్పే కానీ ఆ తప్పు చేస్తున్నది ఆ తల్లితండ్రులే అయినపుడు ఎవరిని నిందించాలి?

వృద్ధాప్యం లోనే భాగస్వామి అవసరం ఎక్కువ. ఒకరి అవసరం ఒకరికి తెలిసేది ఆ వయసులోనే. కానీ  ఆ వయసులో అనాధలని వాళ్ళు చేరదీస్తే బాగుంటుందేమో అని అనిపిస్తుంది కానీ ప్రభుత్వం ఆ వయసు వాళ్ళకు దత్తత నివ్వడానికి ఒప్పుకోదు. రెండు సమస్యలు ఒకసారి తీరుతాయి కాబట్టి ఆ పద్ధతి బాగుంటుందేమో అనిపిస్తుంటుంది. ఎవరి మనసుకు నచ్చిన పని వాళ్ళు చేసుకోవడమే అన్ని విధాలా అందరికీ ఉత్తమం కానీ చిన్న పిల్లల జీవితాలని బలితీసుకునే పని ఎవరు చేసినా అది ఘోర అపరాధమే!!!

(note:అభిశాపం అన్నా శాపం అన్నా ఒకటేనా? ప్రాస బాగుందని పెట్టాను ఎవరైనా చెప్పండి)

2 comments:

తాడేపల్లి said...

మంచిప్రశ్నే సంధించారు. శాపమూ, అభిశాపమూ ఒకటి కావు. శాపమంటే అందఱికీ తెలుసు. అభిశాపమంటే అభాండాలు వేయడం. "అభాండం" అనుకోవచ్చు.

"అథ మిథ్యాభిశంసనమ్ అభిశాపః" అని అమరకోశం,

నీహారిక said...

తాడేపల్లి గారికి,
స్వాగతం , వృద్ధులు సరదాకి పెళ్ళి చేసుకుంటున్నారని అభాండం వేస్తున్నారుగా, అలాగయినా నా టైటిల్ కరక్టే కదా అలాగే ఉంచేస్తాను తెలియచేసినందుకు మీకు కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు.