Friday, January 7, 2011

సీతమ్మ అందగత్తె కాదా ?

రావణ యుద్ధం ముగిసింది. సీతమ్మ అగ్ని పరీక్ష తరువాత రాముని చేరింది. అయోధ్య అంతటా పండుగ వాతావరణం నెలకొంది. ఊరంతా సందడి, పట్టాభిషేక ముహూర్తానికి సమస్త లోకాన్నంతటినీ ఆహ్వానించారు. సుగ్రీవుడినీ, పరివారాన్నీ కూడా ఆహ్వానించారు. వానరాన్నంటిలోకి ముసలి వానరమైనటువంటి ఒక వానరానికి సీతని చూడాలని కోరిక పుట్టింది. రావణుడంతటి వాడు ఎత్తుకెళ్ళాడు కదా, ఎంతటి అందగత్తో కదా అని అది భావించింది. చక్కగా ముస్తాబై అయోధ్య కి బయలుదేరింది. దారిలో అందరూ సీతమ్మ అందాన్ని పొగుడుతుంటే ఆమెను చూడాలని మరింత తహ తహ లాడింది. పట్టాభిషేకం మొదలైంది. సర్వాంగసుందరుడైన రాముడు ఆశీనుడైనాడు,  ప్రక్కనే సీతమ్మ దివ్య మంగళరూపంతో, అనంత ప్రకాశం తో వెలిగిపోతుంది. వేద వాయిద్య సహితంగా పట్టాభిషేకం ముగిసింది.

అంతా వీక్షించిన తరువాత వానరానికి ఒళ్ళు మండుకొచ్చింది , సీతను గురించి ఎంతో ఊహించుకున్న వానరానికి సీతను చూసేసరికి, ఈమె ఇలా ఉందేమిటి, పెద్ద అందగత్తె అని అన్నారు, రావణుడు ఈమెను చూసి  మోహించాడన్నారు, ఈమేమిటి ఇలా ఉంది? ఈమె మూతి ఎర్రగా లేదు, శరీరం నిండా రోమాలు లేవు, శీత్కృతాలు (నోటితో చేసే శబ్దాలు) కూడా చేయటం లేదు , తోక కూడా లేదు, ఛీ ! ఈమె నాకు నచ్చలేదు అని చక్కా పోయింది.

వానరం దృష్టిలో అందం అంటే ఒక నిర్ధిష్టమైన అభిప్రాయం ఉంది. అందుకే వానరానికి, సీత నచ్చలేదు. మన దృష్టితో లోకాన్ని చూస్తే అలాగే అనిపిస్తుంది. ఏది ఎందుకు జరుగుతోంది? ఎలా జరుగుతుంది అనేది ముందే నిర్ణయింపబడి ఉంటుంది. అది మన ఊహకి అందదు.  శివుని ధనుస్సు ఉన్న భోషాణాన్ని అలవోకగా నెట్టిన సీతకి లంక నుండి పారిపోవడం పెద్ద సమస్యా? దుష్ట శిక్షణ జరగాలి, శిష్ట రక్షణ జరగాలి, రాముని పరాక్రమం ఈ లోకానికంతటికీ తెలియాలి. సీత అందాన్ని మానసికంగా చూస్తేనే తెలుస్తుంది. రాజ్యాలు, భోగాలూ, నగలూ, నాణ్యాలూ ఇవేమీ సీతని ఆకర్షించలేవు. ఈనాటికైనా, ఏనాటికైనా రాముడు ఆమె సొంతమన్న భావన ఉన్న సీత అందగత్తె కాదంటారా?
                                           

18 comments:

ఆకాశరామన్న said...

Excellent..!!

durgeswara said...

చాలాబాగాచెప్పారు .

అనామకుడు said...

well said

ఆత్రేయ said...

కల్పనే అయివుండొచ్చు చక్కటి కధ, బాగుంది.

mmd said...

good logic

srikar said...

బాగుంది

రాజేష్ జి said...

Excellent Madam! Beautifully narrated.

Priya said...

100% andagatte kada maree.........!!! baga chepparu anninu.

Swapna.

krishna said...

ఈ కధ కి మూలం తమిళ కధ కదండీ? ఎవరో ప్రముఖ రచయతనే గుర్తుకు రావడం లేదు. విపులలో ఈ కధని చదివాను. చాలా మంచి కధ అది. ఆ కధలో వానర స్త్రీలు అందరూ సీత కోసం ఎదురు చూస్తారు.

Rao S Lakkaraju said...

అందం చూసే వాళ్ళ బట్టి వుంటుంది అని చెప్పటం చాలా బాగుంది.

Weekend Politician said...

Nice post.

నీహారిక said...

weekend politician Gaaru,
Thanks.
Krishna Gaaru,
Ramayanam is also a story, It is not my own story.

krishna said...

ఇది వాదన అనుకోకండి. ఈ కధ కల్పితం. అసలు రామాయణం లో లేదు. రచయత కల్పితం.అలాగే రామాయణం పైన చాలా మంది వాఖ్యానాలు రాసారు. అది కధని అర్ధం చేసుకునే వారి తీరు. అక్కడ క్రెడిట్ ఆ వ్యాఖ్యానం కి చెందుతుంది. మొల్ల రామాయణం , తులసీ దాసు రామాయణం వగైరా అసలు కధ కంటే ఆ శిల్పానికి ప్రశంసా అర్హమైనవి. కానీ ఇక్కడ మీరు కధ పై మీ వ్యాఖ్యానం రాసినట్టు అనిపించలేదు. కధా పరిచయం కూడా కాదు అనిపిస్తుంది.అంతే.

రాజేష్ జి said...

నీహారిక గారు,

మూల కథ ఏవరిదైనా సరే, మీరు వర్ణించిన తీరు అద్భుతం. నాకైతే ఎలాంటి అభ్యంతరం కనిపించుటలేదు టపా తీసివేయడానికి. ఈ కథలో పిల్లకాకి వ్యధ లాగా కాకుండా ఏంటో పరమార్థం ఉంది.

Keep spirit up in bringing such message based stories and narrating in your own way.

Anonymous said...

శూర్పణఖ, తార, మడోదరులు అందగత్తెలు కారా? రావణుడు అందగాడు కాదా? ఇలా పోస్ట్లు రావాలి.

Girish said...

mana sampradaayam samskruthi lo parayi magavadini thalachani woman,
chakkati attitude, confidence unna woman andagatthe ani na
abiprayam..so seetha andagatthe :-)

నీహారిక said...

GiriSh Gaaru,
Thank you.

lifestories.com said...

andham gurchi baga chepparu.ithe konthavaraku matrame bahyandam lage manasika andhamlo kuda evari drusti varide konthamandikiswardham istamundadhu konthamandi avasarame antaru evaru dristi varidhi