Saturday, June 25, 2011

కాశ్మీర్ సోయగం -1

హిమాలయాలు అంటేనే ఆధ్యాత్మిక నిలయాలు. అటువంటి హిమాలయాల సొగసు చూడాలంటె “భూతల స్వర్గమైన” కాశ్మీర్ కి ప్రయాణమవ్వాల్సిందే.



అనేక మంది సాధువులు, సంతులు ఇక్కడ దేవాలయాలు ,మసీదులు నిర్మించి అధ్యాత్మికతకు , ప్రాకృతిక సౌందర్యాన్ని ఆశ్వాదించడానికి కృషి చేసారు.

నెక్లెస్ ఆకారంలో ఉన్న జమ్ము అండ్ కాశ్మీర్ వెళ్ళడానికి విమాన యానం ద్వారా డిల్లీ వెళ్ళి అక్కడి నుండి శ్రీనగర్ కి చేరుకోవచ్చు. మేము కాశ్మీర్ కి ఈసారి విమానంలో వెళ్ళీనా... మొదటి సారి వెళ్ళినపుడు జమ్ము తావి నుండి శ్రీనగర్కి వెళ్ళే బస్సు ప్రయాణం నచ్చింది. హిల్ స్టేషన్ కి వెళ్ళేటపుడు కొండల మధ్యలో నుండి బస్సులో ప్రయాణిస్తుంటేనే బాగా ఆస్వాదించగలం. డిల్లీ నుండి ఒక గంటలో శ్రీనగర్ కి చేరుకున్నాం కానీ ఏమాత్రం అనుభూతి మిగలలేదు. బస్సు ప్రయాణమే బాగుంది.



పోయిన సంవత్సరం గాంగ్ టాక్ కి వెళ్ళాం కదా, ఈ సారి కాశ్మీర్ కి వెళదాం అనుకుని, అపుడు రెండు రోజులే ఉన్నామని ఈ సారి వారం రోజులుందాం అనుకున్నాం. వర్షాలు పడతాయి అక్కడ ఎంతో బాగుంటుంది అని ఎంతో ఆశపడ్డాను . కానీ జూన్ నెల అక్కడ సమ్మర్ అంట, ప్రొద్దున్న నాలుగు గంటలకే తెల్లవారి పోయేది రాత్రి ఎనిమిది గంటలవరకు వెలుతురు ఉండేది. అక్కడున్న ఎండకి మేము నల్లగా మాడి పోయాము. ఇక్కడకి వచ్చాక వారం రోజులకి గానీ మా మొఖాలు మళ్ళీ యధాతధ స్థితికి రాలేదు. అలా కాశ్మీర్ నన్ను రెండు సార్లు నిరాశపరిచింది.

కాశ్మీర్ ఏమీ మారలేదు. అలాగే ఉంది. నాకైతే గాంగ్ టాక్ బాగుంది. ఈ కాశ్మీర్ కోసం జనాలు ఇంత గొడవలు పడాలా అని కూడా అనిపించింది.

 లేక్ ప్రక్కన చేతులు పట్టుకుని ఒకరి నొకరం చూసుకుంటూ నడచిన రోజులు గుర్తుకువచ్చాయి. ఇపుడు మా ఆయన ధ్యాసంతా ఆ కెమేరాలు, మమ్మల్నిద్దరినీ నిద్ర లేపడాలూ , తయారు చేయించడం ప్రొద్దున్నే బయటికి తీసుకుపోవడం సాయంత్రం తిరిగి రావడం. మళ్ళీ రేపటికి ఏర్పాట్లు చేయడం తోనే సరిపోయింది.

అక్కడేదో చలి గా ఉంటుందని స్వెట్టర్లు, గొడుగు,ఐరన్ బొక్స్, వగైరా సరంజామా తో యధావిధి గా బయల్దేరాం. అక్కడ చూస్తే చలీ లేదు, తొక్క లేదు. మోయడానికి తప్పితే దేనికీ పనికి రాలేదు. కాశ్మీర్ మాత్రం బాగుంది. కాశ్మీర్ లో మేము ఏడు రోజులు ఉన్నాం.

కాశ్మీర్ లో చూడదగ్గ ప్రదేశాలు:


పహల్ గాం

గుల్మార్గ్

సోనామార్గ్

యూస్ మార్గ్

మొఘల్ గార్డెన్స్

దాల్ లేక్

వాటి గురించి తదుపరి టపా లో ...


No comments: