Tuesday, June 28, 2011

What is Standard Of Life?


"స్టాండర్డ్ ఆఫ్ లైఫ్" అంటే ఏమిటి? 
అసలు "జీవితం" అంటే ఏమిటో తెలిస్తే కదా... స్టాండర్డ్ గురించి తెలిసేది.
జీవితం అంటే సమస్యలని సాల్వ్ చేసుకుంటూ పోవడమే "జీవితం" అని నా ఉద్దేశ్యం .
సమస్యలు లేని జీవితం ఉంటుందా ?
ఏదయినా సమస్య వస్తే ముందు కంగారు పడిపోవడం సమస్య ఎలా సాల్వ్ చేయాలో ఆలోచించకుండా ఎందుకు వచ్చింది ముందు పోస్టుమార్టం చేస్తూ ..... చిన్న సమస్య కూడా భూతద్దం లో పెట్టి చూడడం తప్పు .
 రానీ... సమస్యని దాని సంగతి చూద్దాం అని అనుకుంటూ ఉంటాను.
ఒకరి స్టాండర్డ్  ఏమిటి ? ఏమి కోరుకుంటున్నారో  ఎవరు నిర్ణయిస్తారు?

Standard Of Life is

1.Autonomy
2.Recognition
3.Sense of Belonging ness
4.Self Development
5.Rewards And Benefits.

అటానమీ అంటే స్వేచ్ఛ ....ఒకరికి ఒకరు స్వేచ్ఛ ఇవ్వగలరా? ఎవరికి వారు తెచ్చుకోవాలి. ఒకరు ఇస్తే వచ్చేది కాదు. స్త్రీలు స్వేచ్ఛ ని తమంత తాము కోరుకోరు. తమ స్వేచ్ఛని ఎవరైనా హరిస్తున్నారని భావించినపుడు మాత్రమే దానిని కోరుకుంటారు. ఎంత ఉద్యోగం చేసినా ఇంటి గురించి ఆలోచిస్తూ తమ స్వేచ్ఛ ని వారే వదులుకుంటారు. తాముగా వదులుకుంటున్నపుడు ఒకరు ఇచ్చేదేమిటి?

రికగ్నిషన్ అంటే గుర్తింపు.... స్త్రీలకి గుర్తింపు ఉందా? వాళ్ళు చేసిన దానికి గుర్తింపు అంటూ ఉంటే ఈ "రమ్యంగా కుటీరాన" ఉండేది కాదు.

సెన్స్ ఆఫ్ బిలాగింగ్ నెస్ అంటే అన్యోన్యత  .... .పైన చెప్పిన రెండూ ఎవరికైతే దొరుకుతాయో వారు అన్యోన్యత సాధించినట్లే.

సెల్ఫ్ డెవెలప్ మెంట్ అంటే సాధికారత .... వ్యక్తిగత సంతోషం మరియు కుటుంబ లక్ష్యాలు రెండూ కలిసి సాధించగలిగితే అదే సాధికారత.

రివార్డ్స్ అండ్ బెనిఫిట్స్ అంటే బహుమతులు, అనుభూతులు,అనుభవాలు. 
----
పైన చెప్పినవాటిని  ఒకరికి ఒకరు ఇవ్వలేరు, ఇవ్వాలని ప్రయత్నించడం, ఇవ్వలేదని బాధ పడడం వ్యర్ధం. ఎవరికి వారు సాధించుకోవాలి. 

నాకు నచ్చినట్లుగా  నా జీవితం గడపడమే నా "స్టాండర్డ్" ... నా"స్టేటస్".

3 comments:

శరత్ 'కాలమ్' said...

"నాకు నచ్చినట్లుగా నా జీవితం గడపడమే నా "స్టాండర్డ్" ... నా"స్టేటస్"."

బావుంది. కొన్ని మినహాయింపులతో మీరు చెప్పినదాంతో ఏకీభవిస్తాను.

ఎందుకో ? ఏమో ! said...

nice

?!

SRINIVASA RAO THANGA said...

good work madam. keep it up. i am also coming with a telugu blog in a short period of time. see my present blog for teachers iteacherz.blogspot.com