Monday, December 28, 2015

దొండకాయ వంటి కూరయు .... మొమైత్ ఖాన్ వంటి భార్యయు ....

ఈ రోజు నాకిష్టం అయిన ఒక వెజిటబుల్ గురించి మీరు తప్పనిసరిగా తెలుసుకోవాలి. మీరు వద్దు వద్దు అన్నా నేను వినను కదా ?  అమ్మాయిలందరూ దొండకాయ అంటే యాక్ అంటున్నారు. దొండకాయ తింటే బ్రెయిన్ పనిచేయదంట బెండకాయ తింటే మెదడు బాగా పనిచేస్తుందట (అది ఉన్నవాళ్ళకు కదా) ???

దొండకాయ ఫ్రై , దొండకాయ పచ్చడి, దొండకాయ పులుసు, దొండకాయ మసాలా , దొండకాయ కొబ్బరి, దొండకాయ దోసకాయ పచ్చడి, దొండకాయ బిరియానీ  లాంటి ఎన్నో రకాల వెరైటీలు చేసుకోవచ్చు.

ఇక మెడిసినల్ వేల్యూ విషయం లోకి వస్తే విటమిన్ A,C Antioxident agent ముఖ్యంగా glucose 6 phosphate engyme  వల్ల డయబెటిక్ వాళ్ళకు కూడా మంచిది.


నాకిష్టం అయిన దొండకాయ అంటే ఇష్టపడేవాళ్ళు ఎవరయినా ఉన్నారా ?
వారికి దొండకాయ వంటి కూరయు మొమైత్ ఖాన్ వంటి భార్యయు దొరుకు గాక !!
(Google Plus Post shared on 30 Mar 2013)

5 comments:

Zilebi said...


ఇదేమిటండి వరుస బెట్టి 'అందరూ' దొండ కాయ మీద పడ్దారు :)

వెంకట రాజారావు . లక్కాకుల said...

దొండవేపుడైన దొండపచ్చడియైన
నెంతొ రుచికరమ్ము , హితవు నాకు
దొండకాయతోటి బెండకాయా పోటి ?
కాదు రమ్యగారు కానె కాదు .

Haribabu Suranenii said...

ముమైత్ ఖాను ఇప్పుడు ఔత్ ఆఫ్ డేటెడ్ - బామ్మ లెఖ్ఖ,
హిట్ల ప్రకారం చూస్తే సన్నీ లియోన్ ఒక్కతే హాట్ ఫావరేట్:-)

నీహారిక said...

హరిబాబు గారు,
నాకు సన్నీ లియోన్ కంటే మొమైత్ ఖాన్ నచ్చింది మరి !
రాజారావు గారు,
నా పేరు రమ్య కాదండీ !
జిలేబీ గారు,
కమెంట్ సెక్షన్ లో ఏదన్నా కనపడితే ఇలా వాయించేయడమే !

nmrao bandi said...

నీహారిక మేడం గారూ,
మీ పోస్ట్ కు నా స్పందన ఈ క్రింది లింక్ లో చూడగలరు...

http://nmraobandi.blogspot.in/2016/01/aka-mumaith-khan-vs-sunny-leone.html

:-)