Wednesday, December 23, 2015

ఆయతనవాన్ భవతి !

దేశమంతా గర్వించేలా,కనీ వినీ ఎరుగని రీతిలో తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి  స్వయంగా పర్యవేక్షించి, నిర్వహిస్తున్న ఆయుత చండీ యాగం  ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ఎంతో ఘనంగా ప్రారంభమైనది.గత 200 సంవత్సరాలలో ఇటువంటి యాగం జరగలేదని విశ్లేషకులు భావిస్తున్నారు.


యాగశాల మొత్తం వేదఘోషతో ఆధ్యాత్మికతను సంతరించుకున్నది.ఇంతటి బృహత్తరమైన కార్యాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. హిందూ ధర్మం గురించి గొప్పలు చెప్పి ఓట్లు దండుకున్నవారే కానీ హిందూ ధర్మాన్ని ఆచరించి చూపిన నాయకుడు లేరు.యాగశాల,అతిధులకు విశ్రాంతి మందిరాలు,భోజన శాల,వైదిక బ్రాహ్మణులు,పూజా ద్రవ్యాలు,అహుతులు ఒకటేమిటి సమస్తం అందుబాటులో ఉంచి యాగాన్ని ఉమ్మడి గవర్నర్ నరసింహన్ గారితో ఘనంగా ప్రారంభించారు.


యాగాన్ని ప్రత్యక్షంగా చూడలేనివారికోసం తెలంగాణా న్యూస్ చానెల్ ప్రత్యక్ష ప్రసారాలను అందిస్తున్నది. మాడిసన్ స్క్వేర్ లో చేసే శుష్క ప్రసంగాలకన్నా స్వదేశంలో చేసే యజ్ఞ యాగాదులే శ్రేష్టమైనవి.ఎవరు ఏ క్రతువు నిర్వహించినా అది స్వార్జితమైతే తప్ప కర్తకు ఫలం లభించదంటారు కనుక ఈ యాగఫలం దేశప్రజలందరికీ చెందాలని కేసీఆర్ గారు ఆకాంక్షించారు కాబట్టి పంచభూతాల సాక్షిగా జరిగే ఈ చండీయాగం నిర్విఘ్నంగా జరగాలని కోరుకుంటూ ప్రపంచ శాంతి స్థాపనకు తెలంగాణా రాష్ట్రం తద్వారా భారతదేశం ఆదర్శం కాగలదని ఆశిస్తున్నాను.

2 comments:

Zilebi said...


చాలా బాగా చెప్పారు -> మాడిసన్ స్క్వేర్ లో చేసే శుష్క ప్రసంగాలకన్నా స్వదేశంలో చేసే యజ్ఞ యాగాదులే శ్రేష్టమైనవి

వేయండి వేయి వీర తాళ్ళు నీహారిక గారికి :)

జిలేబి

నీహారిక said...

ధన్యవాదాలు జిలేబీ గారు.