Saturday, January 23, 2016

సంజయ్ దత్తూ .... సత్ప్రవర్తనా !

పీకే సినిమాలో సంజయ్ దత్ నటించాడు. ఆయన జైల్ లో ఉన్నాడు కదా ఎలా నటించాడు అన్న సందేహం వచ్చింది. జయలలిత లాగా, జగన్ లాగా  ఖైదీలందరూ విడుదలైపోయి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటుంటారు. మనమే పనీ పాటా లేకుండా వాళ్ళ పనులు చూస్తూ ఉంటాము. దేవుడు పని దేవుడు చేస్తూనే ఉంటాడు. మనం చూసే టైం రావాలి కదా ?

జైలులో సంజయ్ దత్ సత్ప్రవర్తన వల్ల ముందుగా విడుదల చేస్తున్నారట ! ఖైదీలందరికీ ఈ వెసులుబాటు ఉంటే బాగుంటుంది కదా ? హిందూ సమాజం కోసం అద్వానీ కూడా అరెస్టయిపోయి సత్ప్రవర్తనతో బయటికి వచ్చేయవచ్చు కదా ? 

నేనే ప్రధాని అయితే ఉగ్రవాదులందరికీ జీవిత ఖైదు శిక్ష వేసి, వారికి చదువుకునే అవకాశం కల్పించి, ఐ ఏ ఎస్ లాంటి ఉన్నత పదవులను సాధించిన వారినే సత్ప్రవర్తన కలిగినవారిగా గుర్తించి విడుదల చేస్తాను.(conditions apply)

ఉగ్రవాది అయినా, దోపిడీదారైనా,హంతకులు ఎవరైనా నేరానికి శిక్షా ఆ శిక్ష వల్ల మనిషిలో మార్పు రావడం అవసరం ! మనం ఏ పని అయినా కష్టపడి సాధించవచ్చు కానీ ఒక మనిషిని మార్చడం మాత్రం సులభం కాదని శ్రీకృష్ణుడే శెలవిచ్చాక మానవ ప్రయత్నం మాత్రమే చేయగలం !

1 comment:

Anonymous said...

Sanjay dath enjoy holiday home in jail. 3 times a day biryani and haleem. Every 2 months excursion to home.