Wednesday, January 27, 2016

రెండు చెత్తబుట్టలు..

జీ హెచ్ ఎం సీ ఎన్నికల ప్రచారం హోరుగా జోరుగా సాగుతున్నది.సాధారణ ఎన్నికలకు కూడా ఇంత ప్రచారం చేయలేదు.పార్టీలన్నీ తాము చేసిన పనులన్నిటినీ గొప్పగా చెప్పుకుంటున్నాయి.స్వచ్చ హైదరాబాద్ సంగతి మాత్రం ఎవరూ ఎత్తడం లేదు.చేసిన పనులనే చెప్పుకోగలరు కానీ చేయని పనులను ఎవరు చెప్పుకుంటారులెండి !

కే సీ ఆర్ గారు అధికారం లోకి వచ్చిన తరువాత స్వచ్చ హైదరాబాద్ లో భాగంగా రెండు చెత్తబుట్టలు అందరికీ ఇచ్చారు.అంతవరకూ బాగానే ఉంది.నా చెత్తబుట్ట ప్రక్కన పెట్టి బుద్ధిగా కొత్త చెత్తబుట్టలలో తడి పొడి చెత్త వేరుగా వేయడం అలవాటు చేసుకున్నాను.తీరా చూస్తే నేను సెపరేట్ గా వేస్తున్న చెత్తబుట్టలు రెండూ కలిపేసి ఒకే చెత్త రిక్షాలో తీసుకెళుతున్నారు.ఈ మాత్రం దానికి నేను విడిగా చెత్త వేసినందువల్ల ప్రయోజనం ఏముంది ?

ఒక పనిని ప్రారంభించినపుడు దానిని పూర్తిగా చేయాలి లేకపోతే ప్రారంభించనే ప్రారంభించకూడదు.రెండు చెత్త బుట్టలు ఇచ్చినపుడు రెండు రిక్షాలను ఇవ్వాలి లేదా ఒకే రిక్షాలో రెండు అరలను ఏర్పాటు చేయాలి.అదంతా చేయాలంటే టైం పడుతుంది అని అంటారా ? వాళ్ళు అలా చేసినపుడు నేను కూడా సెపరేట్ గా చెత్త వేద్దామని డిసైడ్ అయిపోయాను.



No comments: