Thursday, January 7, 2016

కొత్తగా పెళ్ళయిన జంట.....

కొత్తగా పెళ్ళయిన జంట .... ఓ అందమైన ఇంటిలోకి కాపురం పెట్టారు.

కాపురానికి కావలిసిన సామాను అన్నీ సర్దుకుని చుట్టుప్రక్కలవాళ్ళని కలవడానికి కొన్ని రోజులు పట్టింది.

ఈ క్రమంలో భార్య చూపు ఎదురింటి వాళ్ళ పెరట్లో ఆరేసిన బట్టలమీద పడింది. చూడండి వాళ్ళ బట్టలు ఎంత మురికిగా ఉన్నాయో, అటువంటి బట్టలు ఎలా తొడుక్కుంటారో అని ఈసడింపుగా అనడం మొదలుపెట్టింది. రోజూ ఇలా ప్రక్కింటి వాళ్ళను చూసి బాధపడడం ఆమెకు అలవాటుగా మారింది. వింటూ కూర్చోడం భర్త పని అయింది.

ఒకరోజు ఉదయం అలవాటు ప్రకారం డైనింగ్ హాల్లో కిటికీ లో నుండి చూసిన భార్య ఆశ్చర్యపోయింది !!

ఈ రోజు బట్టలు ఎంత బాగా మెరిసిపోతున్నాయో చూడండి అని మురిసిపోతూ చెప్పింది. తెల్లగా మల్లెపూవుల్లాగా ఉన్నాయి అని అంది. అరె ! ఇంటావిడ కూడా అంత అందం గా ఉందే !! రోజూ చూస్తున్నదానికి ఈ రోజుకీ ఏమిటి విశేషం ? అని ఆనందాశ్చర్యాలను తట్టుకోలేక భర్తని పిలిచింది. ఆయన చెప్పింది విని అవాక్కైంది !!

ఈ రోజు నేను నీకన్నా ముందుగా లేచి చుట్టూ ఉన్న తోటని శుభ్రం చేస్తూ ....పనిలో పని గా మన డైనింగ్ హాల్ దగ్గర ఉన్న కిటికీ అద్దాన్ని తుడిచాను... ఇన్నాళ్ళూ దుమ్మూ, ధూళీ, బురద , మరకలు ఉన్నది వాళ్ళ బట్టలకు కాదు ... మన కిటికీ అద్దానికే !! అని తాపీగా చెప్పుకొచ్చాడు భర్త !!

మనం కూడా "మన మనస్సు" అనే కిటికీ లోనుండి బయటకి చూస్తున్నపుడు అది మనకు అందంగా కనపడాలి అంటే ముందుగా మనం మన మనస్సు అనే అద్దాన్ని శుభ్రం చేసుకోవాలి. అందుకు నిరంతర జ్ఞాన సాధనలే పరిష్కారం తప్ప మరో మార్గం లేదు.

(Pubished On 29 Apr 2012)

3 comments:

K. Aravind said...

Good post..baagaane ...............undi.

Anonymous said...

Super

Anonymous said...

Devdaaaa

--Raaju