Sunday, February 21, 2016

శ్రీ కృష్ణదేవరాయ మహోత్సవం !

శ్రీ కృష్ణదేవరాయ మహోత్సవాలు శ్రీకాకుళం గ్రామంలో ఈనెల 11 వతేదీన ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలకు మండలి బుద్ధప్రసాద్ గారు అధ్యక్షత వహించారు.

 శ్రీకృష్ణ దేవరాయ మహోత్సవాల సంధర్భంగా ముగ్గుల పోటీ నిర్వహించారు. నేనెపుడూ ముగ్గులపోటీ కి వెళ్ళలేదు. ఏదో సరదాగా అప్పటికప్పుడు ఒక జల్లెడ, కొన్ని ముగ్గుల రంగులు కొని ముగ్గు వేసాను. పిల్లలు కూడా పాల్గొన్నారు కానీ నేను కృష్ణదేవరాయల బొమ్మ వేసాను కాబట్టి నాకు మొదటి బహుమతి (5 లీ ప్రెషర్ కుక్కర్)  వచ్చింది.


రెండవ బహుమతి పొందిన ముగ్గు


మూడవ బహుమతి పొందిన ముగ్గు


స్పెషల్ ప్రైజ్


సాయంత్రం శ్రీకృష్ణ దేవరాయ మహోత్సవం సందర్భంగా నృత్య పదర్శన ఏర్పాటు చేసారు. గోదాదేవి కళ్యాణం నృత్య రూపకంలో గోదాదేవిగా నాట్యం చేసిన కళాకారిణి నదియా ముస్లిం అయినా హిందువుకన్నా మిన్నగా నృత్యం చేసి అలరించింది. మరొక నృత్య కళాకారిణి క్రిష్టియన్ అయిన మేరీ కూడా బాగా నృత్యం చేసింది.


ఒక మిమిక్రీ నిర్వాహకుడు కొన్ని పోటీలు పెట్టి ప్రైజ్ లు ఇచ్చారు. దానిలో కూడా ఒక ప్రైజ్ వచ్చింది. ఆయన ఒక ప్రశ్న అడిగారు.

రామాయణంలో కవలలు ఎంత మంది ? ఎవరెవరు ? మీరు చెప్పండి చూద్దాం !  

6 comments:

Anonymous said...

Vali - sugreeva
Laxmana - satrughna
Lava - kusa

నీహారిక said...

Yes,correct answer !

మురళి said...

పోటీ రామాయణం గురించి అయినప్పుడు బహుమతి మీకు గాక ఇంకెవరికి వస్తుంది చెప్పండి? :)
శ్రీకాకుళం నాకు చాలా ఇష్టమైన ప్రదేశాల్లో ఒకటండీ.. ముఖ్యంగా ఆ గుడి.. రాయలు ఆముక్త మాల్యద రాసింది అక్కడే అని చెబుతారు.. ఆ గుడి నేపధ్యంతోనే వేటూరి రేడియో కోసం 'సిరికాకొలను చిన్నది' అనే పద్య నాటకం రాశారు.. పుస్తకం, సీడీ రెండూ కూడా దొరుకుతున్నాయి.. అన్నట్టు మీ ముగ్గు చాలా బాగుందండీ...

నీహారిక said...

@ మురళీ గారు,
మీకు దొరికిపోయాను. పల్లెటూరు కదా ఎవరూ చెప్పలేకపోయారు. ముగ్గు కూడా అంతే ! ఇక్కడ మార్వాడీ మహిళలు వేసే ముగ్గులను చూసి ఆశ్చర్యపడేదాన్ని. ఎంతో ఫాస్ట్ గా కళాత్మకంగా వేస్తారు. అక్కడ పోటీలో ఎవరూ లేక నాకు బహుమతి వచ్చింది. శ్రీకాకుళం లో కృష్ణా నది కూడా ఉంది. వచ్చే పుష్కరాలకు నీళ్ళు బాగా వస్తే బాగుండును. పుష్కరాలకు మీరు కుటుంబసమేతంగా తప్పకుండా రావాలి. ధన్యవాదాలు !

thinker said...

మీడియా కు మేత: రాయల వారి కాళ్ళు చేతులు కట్టి ముగ్గులో పడేసిన నిహారిక.
ప్రైజ్ ను జాగ్రత్త పరచండి, ఎపుడైనా అందరూ అవార్డులు వెనక్కి ఇస్తున్నపుడు మీరు కూడా ఖాలీగా కూచోకుండా మీ ప్రైజ్ ను అపుడు వెనక్కి ఇచ్చి సంఘీభావం తెలుపవచ్చు. నేను కూడా చిన్నపుడు రన్నింగు లో వచ్చిన ప్రైజు స్టీలు గ్లాసు ఒకటి రెడీ గా పెట్టుకున్నా, ఈ మారు మెధావులక్కోపం రావడం తరువాయి నేను స్టీలు గ్లాసు ను వెనక్కి ఇచ్చేస్తా.

Zilebi said...



ముగ్గు గీసెను ప్రైజుకి ముచ్చ టొచ్చె
నిప్పు లాగన క్విజ్జుకి నీవు జెప్పె
కవల పిల్లలు మువ్వురు కథయు రామ
కథయె లక్కు యననిదియె గద జిలేబి