Wednesday, February 3, 2016

మనిషి పొట్ట చుట్టుకొలత చూసి రిజర్వేషన్లు ఇవ్వాలి !

రిజర్వేషన్లు ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదో తేల్చుకోలేకపోతున్నారు. కుప్పంలో రెండు ఎకరాలున్న ఆసామి ఒక గొప్పింటి అల్లుడై ఆపై ముఖ్యమంత్రి అయి కూడా రిజర్వేషన్లు ఎవరికివ్వాలో తేల్చుకోలేకపోతున్నారు.

గుజరాత్ లో టీ దుకాణం పెట్టుకుని ఈగలు తోలుకుంటూ ఉన్న రోజులనుండి ప్రధాని మంత్రి అయిన తర్వాత కూడా ఎవరికి రిజర్వేషన్లు ఇవ్వాలో తేల్చుకోలేకపోతున్నారు.

ఒక సామాజిక నటుడు పొట్ట చేతబట్టుకొచ్చి ప్రాణం ఖరీదు నుండి బ్రూస్‌లీ వరకూ 150 సినిమాల్లో నటించి కూడా  రిజర్వేషన్లు ఎవరికివ్వాలో తేల్చుకోలేకపోతున్నారు.

అన్న పేరు చెప్పుకుని సినిమాలు మొదలెట్టినా స్వయం ప్రతిభతో ఎదిగి స్వయంగా వ్యవసాయం చేసుకుని బ్రతుకుతున్న అన్నవరం కూడా రిజర్వేషన్లు ఎవరికివ్వాలో తేల్చుకోలేకపోతున్నారు.

వీరంతా దినకూలీల స్థాయి నుండి ఉన్నత స్థానానికి ఎదిగినవారే కానీ ఏ ఒక్కరూ కూడా రిజర్వేషన్లు కులాలను బట్టి కాదు పేదరికాన్ని బట్టి ఇవ్వాలి అని ఎందుకు చెప్పలేకపోతున్నారో నాకు అర్ధం కావడం లేదు.

నేనొక కుల సంఘ మీటింగ్ కి వెళ్ళాను. అక్కడికొచ్చినవాళ్ళందరి పొట్టలూ 200 cm దాటిపోయి ఆపసోపాలు పడుతూ మీటింగ్ లో మాట్లాడుతున్నారు. అంత పెద్ద పొట్టలున్నవాళ్ళకి రిజర్వేషన్లు ఎందుకో అర్ధమే కాలేదు.

పేదలంటే పొట్ట ఉండకూడదు. పొట్ట ఉంటే పేదలు కారు. ఇకనుండీ పొట్ట చుట్టుకొలత సైజు బట్టి రిజర్వేషన్లు ఇస్తే బాగుంటుంది.

ఒక మనిషి పొట్ట సైజు ఎంత ఉండాలి ?

స్త్రీ పురుషులెవరైనా 25 అంగుళాలకన్నా తక్కువ సైజు పొట్ట ఉంటే వారికి ప్రభుత్వం రిజర్వేషన్లు కల్పించాలి.

పాపం ! కడుపేదలయిన సన్నీ లియోన్, పూనం పాండే లకు రిజర్వేషన్లు కల్పించే విషయాన్ని ప్రభుత్వం ఇప్పటికైనా పరిశీలిస్తుందని ఎదురుచూస్తున్నాను.






7 comments:

bonagiri said...

Innovative idea.
I support it.

Anonymous said...

hahaha.bagundi.correct ga chepparu.padi padi navvanu.

నీహారిక said...

Thank You..Thank you Bonagiri garu !

Anonymous said...

It is shameful to seek reservations showing one's caste.

Haribabu Suranenii said...

nice repartee for this crazy isea

నీహారిక said...

Thanks to everyone !

thinker said...

ఈ వాఖ్యను ఖండించడం జరిగింది, ఎంచిన పిమ్మట ఏతావాతా తేలినది తొంభైతొమ్మిదిన్నర ముక్కలు, మిగిలిన అర ముక్కా ఎగిరి ఎక్కడో పడినది, కాకి దోషి అని నా అనుమానము, వెయిట్ లాసు సెంటర్లతో కుమ్మక్కయ్యి లాలూచి పడిన సంగతి తెలిసిపొయింది. సెక్సిస్టు మార్కు లాగా దీనిని వెయిటిస్టు వాఖ్యగా అభివర్ణిస్తూ, సంతాపం తో కూడిన తీవ్ర దిగ్భ్రాంతి వలన వచ్చిన ఆవేదననను తెలియజేయడమైనది. చట్టం వచ్చి తన పని తాను చేసుకు పోవలసింది గా కోరడమైనది.