Sunday, February 7, 2016

Romantic People !

శారీరక పరంగా .... ఆరోగ్యం
మానసికపరంగా ..... ప్రశాంతత
బుద్దిపరంగా .... శాస్త్రీయ దృక్పధం
ఆధ్యాత్మికపరంగా .... ఉత్తేజం
సామాజికపరంగా .... స్నేహితులు
ఆరోగ్యపరంగా .... లంకణం
ఆహారపరంగా .... రుచికర భోజనం
దాంపత్యపరంగా .... పరస్పరానుకూలత
కష్టాలు వచ్చినపుడు .... నిలబడగలగడం
ఇంటి ఆవరణలో ..... మొక్కలు
రోజంతా కష్టపడినా .... సుఖ నిద్ర
ప్రతిరోజూ ... ఒక కొత్త విషయం నేర్చుకోవడం
కొద్ది సేపు .... సంగీతాన్ని లేదా నృత్యాన్ని వినడం/చేయడం
రోజుకో ఆట (వ్యాయామం) ... ఆడగలగడం
రోజుకో గంట ..... సజ్జన గోష్ఠి
రోజుకో గంట ..... మౌనం
రోజులో కొంతసేపు .... పుస్తక పఠనం
ఎంతో కొంత జ్ఞానాన్ని .... ఇతరులకి పంచడం
ఎవరినైనా కళ్ళల్లో కళ్ళుపెట్టి నిర్బయంగా చూడగలగడం
సూర్యోదయాన్ని, సూర్యాస్తమయాన్ని .... వీక్షించడం
పౌర్ణమి రాత్రి లోని సౌందర్యాన్ని .... అనుభవించగలగడం
వీలైనపుడు ... నదీ స్నానం, సముద్ర స్నానం చేయగలగడం
చిన్నపిల్లలతో .... కలిసి ఆనందించడం
ఇంటినీ, వీధినీ పరిశుభ్రంగా ఉంచుకోగలగడం


ఇవన్నీ ఎవరు చేయగలరో వారే (Romantic People) భాగ్యవంతులు !!

1 comment:

Anonymous said...

agree with you madam