Saturday, August 5, 2017

జిలేబీ రిటర్న్స్ !

ఈ రోజుతో నా బ్లాగ్ మౌనవ్రతం ముగిసింది. సంవత్సర కాలంగా బ్లాగుకి దూరం అయినందుకు బాధపడుతూ నన్ను అప్పుడప్పుడూ వచ్చి మెయిల్ ద్వారా పలకరించిన మితృలకు వందనాలు. నేను బ్లాగ్ ఎందుకు రాయడం లేదు అంటూ చౌదరి గారు పెట్టిన పోస్టు చూసాను. వారిబ్లాగులోనే జకీర్ నాయక్ పోస్టులో  హరిబాబు గారు సంవత్సరం పాటు బ్లాగ్ వ్రాయకుండా ఉండమని చాలెంజ్ చేసారు. మరచిపోయారా ? బ్లాగులేమన్నా పురాణాలా ? నేను వ్రాయకపోతే, మీరు చదవపోతే  అశేష జనవాహినికి  మోక్షం లభించదా ?

రోజూ పద్యాలూ, పూరా(ర)ణలూ, వృత్తాలూ, కవితలూ చదివీ చదివీ మీకు విసుగుపుడుతున్నది అని నాకు తెలుసు. మై హూ నా ! ఈ రోజు మీకో మంచి పాట గుర్తుచేస్తాను. చూసి ఎంజాయ్ చేయండి. గూగుల్లో చూడకుండా ఫీమేల్ వాయిస్ ఎవరిదో చెప్పగలరా ?6 comments:

Zilebi said...చీర్స్
వెల్కం బెక బెక !


ఓ! నీహారిక! నీలవేణి !ప్రమదా ! బ్రువ్వంచు డామ్మంచు బ్లా
గ్లో నీపాదము మోపి కొట్టు ! మనుజుల్ గొల్లంచు యుద్ధంబులన్
తేనీరుల్ గొనుచున్ జిలేబు లకటా త్రేన్పంగ వీలౌను సు
మ్మా! నీ వ్యాఖ్యల కారముల్ మరిచి నామమ్మా సుదీర్ఘంబు గా !

జిలేబి

Anonymous said...

సంవత్సరం తరువాత వచ్చారు. ముఖారవిందం దాచేస్తే ఎలా? ఖాళీ సమయం లో నెట్ లేకుండా ఎలా టైమ్ పాస్ చేశారు? బోర్ కొట్టలేదా?

నీహారిక said...

జిలేబీ గారు ధన్యవాదాలు !

నీహారిక said...

@ Anonymous,

నా మొఖం మీకు కొత్తా ? నా మొఖం "నీతా అంబానీ" లా ఏ ఏటికాయేడు డిప్రీషియేట్ అవుతూనే ఉంటుంది. ఎపుడూ చూపిస్తే దిష్టి తగలదూ ? మీరే మీ పేరుని దాచేస్తున్నారు. ఆగస్టులో బ్లాగులు మానేసిన తరువాత సెప్టెంబరులో మా మామగారు, నవంబరు లో మా నాన్నగారు కాలం చేసారు. నాకు వ్రాయాలన్న ధ్యాసే కలుగలేదు. ఇప్పటికీ వ్రాయాలని లేదు. నేను వాట్స్ అప్, ఫేస్ బుక్ కూడా వాడను. టైం పాస్ కి నా దగ్గర బోలెడు మార్గాలు ఉన్నాయి. షేర్ మార్కెట్, కూరగాయల మార్కెట్, 200 పైగా మొక్కలు, పిల్లులు, కుక్కలు, కాలక్షేపానికి సంసారం ఒక చదరంగం కాదా ? క్షేమ సమాచారాలడిగినందుకు ధన్యవాదాలు !

Anonymous said...

బ్లాగుల్లో మీరుంటే ఆ ఉత్సాహం వేరు. షేర్ మార్కెట్ లో ఎంత సంపాదిస్తారు? చాలా మంది ఉన్నది పోగొట్టు కొంటారు.

నీహారిక said...

షేర్స్ లో పోగొట్టుకోవడం మళ్ళీ రాబట్టుకోవడం ఉంటాయి. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి అని అంటారు కదా ? ఇంట్లో 24 గంటలూ వాటి గురించే మాట్లాడుకుంటుంటే నేర్చుకోక తప్పడం లేదు. అదో కాలక్షేపం మాత్రమే ! బ్లాగుల్లోనే కాదు ఇంట్లో కూడా నేను లేకపోతే తోచదంటారు. బాగా పోట్లాడతాను కదా ? ఇవాళ calm గా ఉన్నావేమిటీ అని అడిగి మరీ గొడవపడతారు.