Friday, August 11, 2017

నువ్వేం మారలేదురా ...

హీరో నాగచైతన్య మొదటి సినిమా "జోష్" చూసారా ? కమర్షియల్ గా సక్సెస్ కాలేదు కానీ నాకు బాగా నచ్చింది. నాగ చైతన్య కూడా బాగానే చేసాడు. సినిమాలో చాలా డైలాగ్స్ నాకు నచ్చాయి. 



ఒకసారి ప్రకాష్ రాజ్... మేము పాఠాలు చెప్పి పరీక్ష పెడతాం కానీ లైఫ్ అలాకాదు .... పరీక్ష పెట్టి పాఠం నేర్పుతుంది....అదే గుణపాఠం. ఆ పరిస్థితి ఎవరికీ రాకూడదనే చెపుతాం అంటాడు. ఆ తరువాత నిజంగానే లైఫ్ లో గుణపాఠం నేర్చుకుని పాఠం నేర్చుకుంటాడు.




ఒకసారి జె డీ చక్రవర్తి పార్టీ మీటింగ్ కి రమ్మని కాలేజ్ కుర్రాళ్ళని బెదిరిస్తుంటాడు. వాళ్ళు అపుడు నాగ చైతన్యతో బెట్ కడతారు. ఈలోపు వాళ్ళు రావడం లేదని ఫోన్ మీద ఫోన్ చేస్తూనే ఉంటాడు. అపుడు ఒక కుర్రాడు ఇక్కడ లైవ్ లో ఇంత ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంటే బయటకొచ్చి ఏం చేయాలి ? అని అడుగుతాడు. ఆ సీన్ నాకు బాగా నచ్చింది.



ఇదంతా ఎందుకు చెపుతున్నానంటే నిన్న ఒకరు నువ్వేం మారలేదు అని అన్నారు. నేనెందుకు మారాలి ?          

No comments: