Thursday, August 24, 2017

ఇన్‌ఫోసిస్ ఇన్‌వెస్టర్లకు మాత్రమే !

ఇప్పటికే ఇన్‌ఫోసిస్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఏం చేయాలి ? కొత్తగా కొనాలనుకునేవాళ్ళు కొనవచ్చా ? అన్న ప్రశ్నలకు నాకు తెలిసిన సమాచారం ఇక్కడ పంచుకుంటున్నాను.

ఇప్పటికే ఇన్‌ఫోసిస్ లో పెట్టుబడి పెట్టిన వాళ్ళు బై బాక్ లో అమ్ముకోవచ్చు. కొంతకాలం పాటు ఈ షేర్స్ లో పెద్దగా లాభాలు వచ్చే అవకాశం లేదు కాబట్టి ఇప్పటికి అమ్ముకుని వేరే వాటిల్లో పెట్టుబడి పెట్టవచ్చు.

కొత్తగా ఇన్‌ఫోసిస్ లో పెట్టుబడి పెట్టవచ్చా అంటే పాతవాళ్ళనే అమ్ముకోమని చెపుతున్నపుడు కొత్తవాళ్ళకి పెట్టుబడి పెట్టమని ఎందుకు చెపుతున్నానంటే ఇపుడు మార్కెట్ రేటు 900 రూ ఉంది కాబట్టి... కంపెనీ బై బాక్ రేటు 1150 రూ కనుక ... షార్ట్ టెర్మ్ లో లాభం ఆశిస్తూ పెట్టుబడి పెట్టవచ్చు.

2 లక్షల లోపు పెట్టుబడి పెట్టిన షేర్ హోల్డర్లకు 173 షేర్లు ఉంటే కనీసం 100 షేర్లు బైబాక్ చేసే అవకాశం ఉంటుంది.

మొత్తం పెట్టుబడి 173*900 = 1,55,700

కంపెనీ బై బాక్ చేస్తుంది అనుకుంటున్న షేర్ల పెట్టుబడి విలువ 100*900 = 90,000

బై బాక్ రేటు విలువ  100*1150 = 1,15,000

నికర లాభం 11500 - 90000 = 25000 ( షుమారుగా మూడు నెలలకి )

ఓసోస్... పాతిక వేలకోసం అంత పెట్టుబడి పెట్టాలా అని అనుకుంటే షేర్ మార్కెట్ లో ఊరికే డబ్బులు వచ్చేయవు. పాతిక వేలు లాభం అంటే చాలా ఎక్కువ. లాభం గ్యారెంటిగా వస్తుందా అంటే మన షేర్లు ఎన్ని బై బాక్ చేస్తారో తెలియదు.

కొత్తగా కొనాలనుకునేవాళ్ళు లాంగ్ టెర్మ్ వేచి ఉండగలిగితేనే కొనాలి. ఒకవేళ లాభం రాకపోతే వాటిని అమ్మేసుకుని వేరే షేర్ల లోకి మాచ్చు. బ్రోకరేజ్ నష్టపోయినా పర్వాలేదు అనుకుంటేనే కొనుగోలు చేయవచ్చు అని నా అభిప్రాయం.  

 పాత ఇన్వెస్టర్లు మాత్రం బై బాక్ లో కొన్ని షేర్లు వెంటనే అమ్ముకోవాలి. మూడు వేల రేటు పెట్టి కూడా కొన్నవాళ్ళు నాకు తెలుసు. ఇంకా ఆ షేర్ లోనే కొనసాగడం అనవసరం.

బ్యాంక్ లలో డబ్బు దాచుకోవడం మానేసి షేర్లలో పెట్టుబడి పెట్టండి. చిన్న ఇన్వెస్టర్లకు వడ్డీ తగ్గించేసారు కనుక బ్యాంక్ లో దాచుకునే బదులు షేర్లలో పెట్టుబడి క్షేమం. చైనా తో యుద్ధం వస్తుందనో, కొరియాతో యుద్ధం వస్తుందనో, ట్రంప్ తుమ్మాడనో మార్కెట్ పడిపోతుంది కదా అని భయపడకండి.

మీ షేర్ పడిపోతే మళ్ళీ పెట్టుబడి పెట్టండి. మీకు తెలిసిన షేర్లలోనే పెట్టుబడి పెట్టండి. మీకు తెలియదు అని అనుకుంటే మూచ్యువల్ ఫండ్ లలో పెటుబడి పెట్టవచ్చు.

షేర్స్ అంటేనే రిస్క్ ... ఇటువంటి ఉ బో స ఇవ్వడం కూడా రిస్కే ....కాదంటారా ?
 
   

2 comments:

Anonymous said...

మీరీమధ్యన టివి షో ళలొ పాల్గొనటంలేదా?

నీహారిక said...

పండుగలకి మాత్రమే ఆడవాళ్ళని పిలుస్తారు. చీరలూ అవీ కట్టుకుని వస్తాము కదా ? మోదీ మరియు కే సీ ఆర్ గారి పాలనలో దేశం సుభిక్షంగా ఉంది కదా అని నేను రాజకీయ చర్చలు మానేసాను.