Monday, August 28, 2017

బెట్టింగ్ బాలాజీ !

(6) కోయిలాల కమ్మని కధ వింటావా ...

సంసారం సజావుగా నడపడానికి డబ్బు అవసరం కదా... జీతం సరిపోనపుడు బాలాజీ బెట్టింగ్ లు కడుతుండేవాడు. ఫుట్ బాల్ మ్యాచ్ లు, క్రికెట్ మ్యాచ్ లు జరిగేటపుడు తన ఆఫీస్ కొలీగ్స్ తో బెట్టింగ్ కట్టేవాడు.  అవతలి వాళ్ళు ఏవరైనా గెలుస్తారని అంటే దానికి విరుద్ధంగా బెట్టింగ్ కట్టేవాడు. నంధ్యాల ఎన్నికలలో టీ డీ పీ గెలుస్తుంది అని  లగడపాటి చెప్పగానే కే సీ ఆర్ వై సీ పీ గెలుస్తుంది అని చెప్పినట్లుగా బాలాజీ కూడా భవిష్యత్ ఊహిస్తూ ఫలానా వాళ్ళు గెలుస్తారని చెప్పేవాడు. అతని అదృష్టం బాగుంటే నిజంగానే గెలిచేవారు. ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ బెట్టింగ్ కట్టేవాళ్ళు ఈసారి కూడా వాళ్ళకే అవకాశం ఇచ్చేవాడు. వాళ్ళు చెప్పినదానికి వ్యతిరేకంగా చెప్పడమే తప్ప భవిష్యత్ గురించి తనకి తెలియకుండానే గెలిచేసేవాడు. ఇలా గెలిచిన డబ్బుతో బడ్జెట్ పద్మనాభం లాగా పైసా పైసా లెక్కలు వేసుకుంటూ డబ్బు కూడబెడుతూ ఉండేవాడు.      
No comments: