Wednesday, August 23, 2017

నారాయణ మూర్తి గారి కర్మ....ఇన్‌వెస్టర్ల ఖర్మ !


మీరు గొప్పవాళ్ళయిపోయినట్లు ఎవరిమీదయినా రాళ్ళేసారనుకోండి, తిరిగి మీమీదకే వచ్చే ప్రమాదం ఉంది. కాంగ్రెస్ మొదలుపెట్టిన గ్లోబలైజేషన్ వల్ల బాగుపడిన వాళ్ళలో మొదట ఇన్‌ఫోసిస్ పేరే చెప్పుకోవచ్చు. కానీ నారాయణ మూర్తి గారు మాత్రం కాంగ్రెస్ ని ఎండగడుతూనే వచ్చారు. వంశపారంపర్యంగా పదవులు అనుభవిస్తున్నారన్నది ఆయన ప్రధాన ఆరోపణ. ఇపుడు ఒక తరంలో త్యాగాలు చేస్తేనే తరువాతి తరం వారు ఫలాలు అనుభవిస్తారు. అది మంచి అయినా కావచ్చు చెడు అయినా కావచ్చు.

నారాయణ మూర్తి ఒక చెట్టు ని నాటారు. నేను వంశపారంపర్యంగా ఫలాలు అందించను నా తరువాత వేరేవాళ్ళు నా కంపెనీ ని చూసుకుంటారు అని చెప్పారు. అందుకనుగుణంగానే వేరేవాళ్ళకి బాధ్యతలు అప్పగించారు. మన చెట్టు కాయలు వేరేవాళ్ళు కోసుకుంటుంటే చూస్తూ కూర్చుండడం అంత వీజీ ఏమీకాదు. కాయలు కోసుకుపోతున్నారు మొర్రో అని బాధ పడడం మొదలుపెట్టారు. కాయలు కోసుకుపోతే పర్వాలేదు చెట్టుకి నీళ్ళు పోయడంలేదు అని కూడా తిట్టడం మొదలుపెట్టారు. ఆయన కాయలు కోయలేడు. కోస్తూ ఉంటే చూడనూ లేడు.

ఇదంతా చూసి అద్దెకు వచ్చినాయన ఇల్లు ఖాళీ చేసిపోయాడు. అద్దెకున్నాయన తను తినగా మిగిలిన కాయలు ప్రక్కింటివాళ్ళకు ఇచ్చేవాడు. ఇపుడు మూర్తి గారి వల్ల వాళ్ళకు కాయలు దక్కకుండాపోయాయని గోల పెట్టేస్తున్నారు. అసలు కాయలు ఎవరివి ? కాయలు ఎవరికి చెందాలి ? ఊసుపోక కూర్చుని రాళ్ళేసింది ఎవరు ? వాళ్ళు వేసిన రాయి తిరిగి వచ్చి ఎవరికి తగిలింది ? వంశపారంపర్య అధికారాన్ని వదులుకోవాలా ? అనుభవించాలా ?  అద్దెకున్నాయనని నమ్మి పెట్టుబడి పెట్టిన వాళ్ళ పరిస్థితి ఏమిటి ?

No comments: