Wednesday, August 9, 2017

చైనా వస్తువుల నిషేదం "హరిసేవా" ?

ఏదో ఒకటి వ్రాసిపడేయ్యాలని, దేశాన్ని ఉద్ధరించేద్దామనీ ఏవేవో వ్రాసి మన మొఖాన పడేస్తారు. మళ్ళీ మనం కమెంట్ చేస్తే ప్రచురించే ధైర్యం చెయ్యరు. ధైర్యం లేనపుడు వ్రాయకండి. మీవల్ల ఎవరికీ ఉపయోగం లేదు. ఎవరైనా తిడితే ప్రచురించకూడదు కానీ ఒక చర్చ లేవదీసినపుడు సమాధానం ఇవ్వాలి కదా ?  చైనా వస్తువులు వాడవద్దని మోడీ ట్విట్టర్ లో వ్రాసారన్నారు. నిజంగా మోడీ అలా వ్రాసారా ? నాకు నమ్మబుద్ది కాక అడిగాను.

నిజానికి చైనా ఎగుమతుల్లో 2.8 శాతం మాత్రమే మనదేశానికి వస్తున్నాయి.  మన దేశం మొత్తం ఎగుమతుల్లో 4.8 శాతం చైనా కి వెళుతున్నాయి. మనం చైనా సరుకులు నిషేదిస్తే వాళ్ళు నిషేదించరా ? ఎవరికి నష్టం ?

యుద్ధం చేయాల్సి వస్తే యుద్ధం చేయాలి. యుద్ధం చేయలేననుకుంటే శాంతి మంత్రం ఎలానూ ఉంది. యుద్ధం బదులు దొంగదారిలో వ్యాపారాన్ని చెడగొడతాననడం సరికాదు. వరల్డ్ ట్రేడ్ నిబందనలు ఒప్పుకోవు. మీకెవరిపైనాన్నా కోపం ఉంటే తిట్టండి లేదా మాట్లాడడం మానేయండి. అంతే కానీ అవతలి వాడిని ఆర్ధికంగా దెబ్బతీసి విజయం సాధించాలనుకోవడం సరికాదు. మనం కొనడం మానేస్తే వాళ్ళకొచ్చే నష్టం ఏమీ ఉండదు. వేరే మార్కెట్ వెతుక్కుంటారు.

చైనా వాళ్ళు కష్టపడతారు. వాళ్ళు డబ్బు కోసమే బ్రతకరు. వాళ్ళ చేతికి పని లేకపోతే బాధపడతారు కానీ మీరు చైనా వస్తువులు కొనకపోతే వాళ్ళ కొచ్చే నష్టమేమీ ఉండదు. మనకి ఏదైనా సమస్య వచ్చిందంటే మన ప్రమేయం ఏమీ లేకుండా రాదు. పాకిస్థాన్ కన్నా చైనా గురించి ఎక్కువ ఆందోళన పడుతున్నారు.  టిబెట్ బోర్డర్ లో ఎపుడు ఉద్రిక్తం గానే ఉంటుంది. సరిహద్దుల విషయంలో చైనా చాలా గట్టిగానే ఉంటుంది. మనం మాత్రం అలా ఉండము. నిర్లక్ష్యం ఎక్కువ.  కాంగ్రెస్ కన్నా మేము ఉద్ధరిస్తాము అని అధికారం లోకి వచ్చి దేశాలు తిరగడం తప్ప చేసినదేమీ లేదు.

చెప్పుకోడానికి ఘన చరితే కానీ దొంగదారిలో మోసం చేయడం మొదటనుండీ ఉన్నదే ! దొంగదారిలో వెళ్ళినపుడు కష్టాలు తప్పవు. మనం తిన్న అన్నం మనమే హారాయించుకోవాలి, మన  కష్టాలు మనమే భరాయించుకోవాలి.  

8 comments:

Zilebi said...హార్నీ :) షేవ్ :)

జిలేబి

madhusudana gupta.t said...

[Top 10 Importing and exporting countries to India in 2016-17 - Indian Retail Sector] is good,have a look at it! http://indianretailsector.com/news/top-10-importing-and-exporting-countries-to-india-in-2016-17/

Anonymous said...

Please read chellaney.net to know about china. it is the no.1 bully and rogue nation in the world.

Anonymous said...

It seems the one year sabbatical hasn't made you any wiser.

Poorwashada Madhu said...

మీరు వెళ్ళడించిన అభిప్రాయాలు చాలా బాగున్నాయండి.

ketan said...

మీ కలం పదునెక్కింది. కొంచెం పరిణతి కనిపిస్తోంది.

హరిసేవ బ్లాగుని పట్టించుకోకుండడమే మీ/నా/మన ఆరోగ్యానికి మంచిది. ఏ విషయంలోనూ లోతైన అవగాహనలేని కొందరు ప్రబుధ్ధులు తమకున్న సైన్సు, ఆర్ధికశాస్త్రం, సామాజిక శాస్త్రాలవంటి గంభీరమైన విషయాలపై తమకున్న మిడిమిడి జ్ఞాన్ని మనతో పంచుకోవడానికి దాన్ని రాస్తున్నట్లుంది. సైనుగురించి రాసిన ఒకట్రెండు వ్యాసాలపై ప్రశ్నలేస్తే, వాళ్ళకి సమాధానం తెలియకపోవడం నా తప్పన్నట్లుగా మాట్లాడారు. అంతటితో ఆ మేధావులను పట్టించుకోవడం మానేశాను. అందులో emotional touch తప్ప rationality అన్నది వెదికినా కనబడదు. ఒకప్పుడు Save India Now అంటూ ఒకరు రాసేవారు గుర్తుందాడీ? ఇదీ అదే బాపతు. కాకపోతే రాస్తున్నది మందికాబట్టి, నస ఎక్కువకాలం సాగుతుంది.

హిందూమతంపై మీ అభిప్రాయాలు సరైనవేకానీ, ఈ పోస్టులో అవి అనవసరం అనుకుంటాను. అంతర్జాతీయ వ్యవహారాల విషయంలో హిందూమతం ఒక ఇర్రెలవెంట్ నాన్సెన్స్.

Sakshyam Group said...

మీ అభిప్రాయాలు ఆలోచనాత్మకంగా ఉన్నాయి.
I really like your site - In addition to this I herewith posting a very useful site regarding the educational and Govt Jobs information.
Click Here To educational and Govt Jobs information.

Haribabu Suranenii said...

ఇప్పుడు చైనా వస్తువులు వాడొద్దన్న హారిసేవ బ్లాగరు వెర్రివెధవ అయితే, అప్పుడు విదేశీవస్త్రబహిష్కారం అన్న తొక్కలో గాంధీ మహాత్ముడు యెట్లా అయ్యాడు?

చెయ్యాల్సిన దరిద్రం అంతా చేసేశాక "యే మేరె వతన్ కె లోగో!" పాటకి యేడ్చి ముఖం తుడుచుకోవటం మాత్రమే దేశభక్తియా?

చైనా - భారత్ అనే రెండు మదపుటేనుగులు నిజంగానే ఢీకొంటాయా?

నేను పరిశీలిస్తున్న మేరకు కొందరు అంతర్జాతీయ విశ్లేషకుల వాదనల ప్రకారం చైనా వర్షాకాలం వరకు స్టేట్మెంట్ల ద్వారా బెట్టు చేసి అప్పుడు పనులు ఆపివేస్తున్నామని సైన్యాన్ని ఉపసంహరించుకుంటుంది - మోర్టారు పనులూ యుద్ధమూ ఈ రెండూ తలకు మాసినవాడు తప్ప వర్షాకాలంలో ఎవడూ చెయ్యడు.ఎందుకంటే, భారత్ ఇదివరకులా నంగిరిపింగిరి కబుర్లు చెప్పడం లేదు.చైనా గనక యుద్ధానికి దిగితే వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేస్తునది.1962 గురించిన డైలాగులు అటూవాళ్ళూ ఇటూవాళ్ళూ పేల్చారు గానీ 1962లో భారత్ సైనికులు ఎదుర్కొన్న ప్రతికూలతల మధ్యన కూడా వారి పోరాటపటిమ చైనా సైన్యాధికారుల్ని చాలా భయపెట్టింది.శారీరక ధృఢత్వం రీత్యా చైనీస్ సైనికులు పొట్టి బుడంకాయలు,భారతీయ సైనికులు ఆజానుబాహులు!అప్పట్లోనే ఆ తేడా స్పష్టంగా కనబడింది.ఓడిపోయిన భారతాదెశపు సైనికుల పట్ల గెలిచిన చైనా సైనికులు చూపించిన గౌరవం అబద్ధం కాదు.

ఇవ్వాళ భారత్ త్రివిధ దళాలూ మహా శక్తివంతమైనవి.చైనాతో యుద్ధం గనక వస్తే ఈసారి పదాతిదళానికి అప్పటి వ్యతిరేకతలు లేకపోగా యుద్ధరంగం చాలా అనుకూలమైనది.చైనాకు ఇప్పటికీ బలమైన నౌకాదళం లేదు.భారత్ మూడు రంగాలతోనూ ధృఢంగా ఉన్న స్థితిలో ఒక్క వాయుసేనతో చైనా గెలవడం అంత తేలిక కాదు.రాజకీయ నాయకులు బహిరంగ ప్రకటనలు ఎన్ని చేసినా యుధానికి సంబంధించిన కీలకమైన నిర్ణయాల విషయంలో సైనికాధికారుల యొక్క నిర్ణయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది,అవి రహస్యంగానే ఉంటాయి.అయినాసరే, మొండికెత్తి యుద్ధానికి దిగితే భారత్ కన్న చైనాకే నష్తం యెక్కువ!

ఎందుకంటే,చైనా ప్రపంచ మార్కెట్టులోకి వచ్చింది ముప్పయ్యేళ్ళ క్రీతమే.వచ్చి సాధించినది యేమిటి?ఇతర దేశాల వాళ్ళ వస్తువుల్ని దొరకబుచ్చుకుని రివర్స్ ఇంజనీరింగ్ చేసి లేబరు చవగ్గా దొరుకుతుంది గనక అతి తక్కువ రేట్లకి అసలు వస్తువులకి పోటీగా వదలటం. అది ప్రపంచానికి ఇచ్చ్గిన సొంత క్వాలిటీ ప్రోడక్టులు చాలా తక్కువ.ఒక పదిహేడేళ్ళ కుర్రాడికి మీరో సెల్ ఫోను ఇచ్చారు,వాడు ఒక్కొక్క స్క్రూ వరసగా విప్పుతూ ఏ వరసలో విప్పాడో గుర్తు పెట్టుకుని మళ్ళీ బిగించి పని చేయించగలిగితే అతనికి దాన్ని తయారుచెయ్యడం తెలిసిపోయినట్టే కదా!విడి పార్టులు గనక చవగ్గా దొరికితే వాడే సెల్ ఫోను తయారు చెయ్యగలడు.షాపు పెట్టేస్తాడు.చైనా యెదుగుదల కూడా ఇలాగే జరిగింది.భారత్ "ఇదరు లేక ముగ్గురు చాలు" టైపు నినాదాలతో జనాభాని తగ్గించుకునే తెలివితక్కువ పనులు చేస్తుంటే చైనా దానికి బదులు మానవ వనరుల్ని ప్రొడక్టివిటీ పెంచటానికి ఉపయొరెగించుకునేసింది!భారత్ ఎదుగుదల దీనికి భిన్నమైనది - స్వతంత్రం వచ్చేటప్పటికే ఉన్న ఇన్‌ఫ్రా స్ట్రక్చర్ని ఉఓయోగించుని బలమైన పునాది ఉన్న దీర్ఘకాలికతని సాధించింది.యుద్ధంలో గెలిచినా ఓడినా భారత్ మళ్ళీ కోలుకున్ననత వేగంగా చైనా కోలునుంటుందంటే నమ్మటం కష్టం!

ఆయుధ రంగ నిపుణులు చెప్తున్న దాని ప్రకారం చైనా బలహీనతలలో లోకల్ మేడ్ ఆర్టిలరీ కూదా ఒకటి.భారత్ వద్ద ఉన్న ప్రతి ఆయుధమూ ప్రతి క్షిపణీ ప్రతి జలాంతర్గామీ బ్రాండ్ వాల్యూ ఉన్నది కాగా చైనా ఎక్కడా ఆయుధాలు కొన్న దాఖలాలు లేవు, అవి కూడా రివర్స్ ఇంజనీరింగ్ ముద్దుబిడ్డలే కాబోలు - ఎంత గొప్పగా పనిచేస్తాయో ఇప్పుడు జరగబోయే యుద్ధంలో భారత్ మీద ప్రయోగించాకే తెలుస్తుంది.

అయితే,రాజకీయంగా సామాజికంగా చైనాకు ప్రతిపక్షం లేకపోవడం వల్లనూ ప్రజల నుంచి వ్యతిరేకత ఉండనందువల్లనూ యుద్ధం ఎంత క్రూరమైన స్థాయిలో చేసినా అడిగేవాళ్ళు ఉండరు.కానీ భారత్ మాత్రం ఇంటిలోనిపోరును ఎదుర్కోవలసి వస్తుంది.ఇక్కడ చైనా గెలిస్తే బాగుండునని కోరుకునేవాళ్ళు కూడా ఉన్నారు.కయ్యిమన్నా కుయ్యిమన్నా సందర్భానికో వీడియో పెడుతున్న ఈ బ్లాగు సంప్రదాయం ప్రకారం యుద్ధంలో గెలిచిన చైనా యోధులకి "మానవత్వం పరిమళించిన మంచిమనిషికి స్వాగతం" టైపు ఆహ్వానపు వీడియోలు కూడా వస్తాయేమో!ఇప్పుడు విజయశాంతి కాస్త ఒళ్ళు చేసింది గనక ఆ పార్టు బీవీ రాఘవులు ప్లే చేస్తే వరవరరావూ హరగోపాలూ కజీరు కనాయక్కూ అహస్తఫా ముస్తాదు పక్కతాళం ముత్తయిదువుల వేషాలు వేస్తారు.హీరోగా సుమన్ అస్సలు ఉండకూడదు పొట్టివీరయ్యని తీసుకురావల్సిందే,ఎట్లాగూ ఆ వచ్చే చైనావాడు పొట్టిబుడంకాయే కదా!

తీరిగ్గా ఒక పోష్టు రాయబోతున్నాను,ఇప్పటికి ఇంతే సంగతులు,చిత్తగించవలెను:-)