Friday, September 1, 2017

ఉగ్రవాదానికి మతం లేదా ?

ఉపరాష్ట్రపతిని చేస్తేనన్నా నోరుమూసుకుని పడి ఉంటాడు అని భావిస్తే వెంకయ్యనాయుడు గారి నోరు మాత్రం తన పని తాను చేసుకుపోతూనే ఉంది. డేరాబాబా ఉదంతం తర్వాత హిందూ మతానికి, ఉగ్రవాదానికీ సంబంధం అంటగడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు.

భా జ పా మొదటినుండీ చేస్తున్నదేమిటి ? ఒక్క లాడెన్, ఒక్క ఆప్జల్ గురు లాంటి వాళ్ళ కారణంగా మొత్తం పాకిస్థాన్ దేశానికే ఉగ్రవాదాన్ని అంటగట్టడం లేదా ? మోదీ వెళ్ళిన ప్రతి దేశంలోనూ పాకిస్థాన్ వ్యతిరేకంగా మాట్లాడడం లేదా ? ఉగ్రవాదం వల్ల వాళ్ళూ బాధపడుతున్నపుడు వాళ్ళని మాత్రం ఉగ్రవాదులుగా చిత్రీకరించలేదా ?

ఈరోజు హిందూమతాన్ని అంటున్నారని అల్లిబిల్లి కబుర్లు చెపితే సరిపోతుందా ? ఈ బాబాలూ, స్వామీజీలు దేశసేవలు చేస్తున్నారా ? మీరు ఈ బాబాల వెబ్ సైట్ కి వెళ్ళండి అక్కడ డొనేట్ అనే టాబ్ తప్పక ఉంటుంది. దేశసేవ చేయడానికి అంగబలమూ, అర్ధ బలమూ తప్పక ఉండితీరాలి.

మాటలతోనే మార్చేయగలిగితే మోదీ కూడా దేవుడే అవుతాడు. మాట్లాడకుండా పనిచేసిన మన్ మోహన్ సింగ్ మీకు నచ్చలేదు. నోటికొచ్చినది మాట్లాడే  వెంకయ్య నాయుడు నాకు నచ్చలేదు.

ఉగ్రవాదానికి మతానికి సంబంధం ఉండితీరుతుంది. మతం ఎంత ప్రమదకరమైనదో, ఉగ్రవాదమూ అంతే ప్రమాదకరమైనది. నేను చేస్తే శృంగారం అవతలి వాళ్ళు చేస్తే వ్యభిచారం అవదు. శృంగారం మానవ జీవితానికి హానికరం అంటే నేనేమీ వ్యాఖ్యానించదలుచుకోలేదు. మీ అభిప్రాయానికి విలువ ఇచ్చి తీరతాను.3 comments:

Jai Gottimukkala said...

నీహారిక గారూ, ఉగ్రవాదం అనే పదానికి సరయిన అర్ధం terrorism నా లేక extremism అవుతుందా? తెలుగులో రెంటికీ ఒకే పదం ఉన్నట్టుంది.

ఇకపోతే టెర్రరిజం మతం ఆధారంగానే ఉండాలని లేదు ఉ. నక్సలైట్లు, ఐర్లాండు (IRA), ఈలం (LTTE), కు క్లుక్స్ క్లాన్ (KKK).

ఒక ఆశయం కోసం పోరాడే వాళ్ళు తమ ఆశయ సాధనలో టెర్రర్ (హింస/భీభత్సం అనవచ్చా?) వాడితే వారిని టెర్రరిస్టు అంటాం. ఇందు వలన ఆశయానికి మచ్చ వస్తుందా? గమ్యాన్ని మార్గాన్ని (గాంధీ భాషలో ends & means) వేరు చేసి చూడలేమా?

నీహారిక said...

ఉగ్రవాదానికి సరి అయిన అర్ధం ఇపుడు మనం శ్యామలీయం గారిని అడిగి తెలుసుకోవాలి. టెర్రరిజం వేరు ఉగ్రవాదం వేరు అని కూడా చెప్పలేము కానీ రెండిటికీ హింస కారణం అయింది కాబట్టి మనం దాని గురించి చర్చిస్తున్నాము. హింసే లేకపోతే నక్సలిజం, టెర్రరిజం, హిందూయిజం గురించి గొప్పగా చెప్పుకునేవాళ్ళం.

హిందూ ఉగ్రవాదం అని ఎందుకు అంటున్నారు ? గోద్రా అల్లర్లు, బాబ్రీ అల్లర్లు కారణం గా హిందూ ఉగ్రవాదం అని అంటున్నారు. మన దగ్గర కొచ్చేసరికి ఆ పదం నచ్చటం లేదు. మార్గాలు వేరు కావచ్చు కానీ శాంతియుతంగా పోరాడటం అన్నివేళలా సాధ్యం కాకపోవచ్చు. వాళ్ళది ఉగ్రవాదమని అంటున్నపుడు మనది ఉగ్రవాదం కాకుండా ఎలా ఉంటుంది ?

భా జ పా పునాదులే రామజన్మ భూమి తో ఏర్పడినపుడు... ఇపుడు మతం గురించి మాట్లాడడం అవసరమా ?

హరిబాబు గారు అన్నట్లు మనిషైనా దేశమైనా ఎదగడానికి రెండే దారులు ఉన్నాయి - ఇతరుల్ని కూడా ప్రోత్సహిస్తూ తన శక్తికి తగిన స్థానం వరకు ఎదిగి ఆగిపోవడం, శిఖరాగ్రానికి చేరుకోవడం కోసం ఇతరుల్ని వెనక్కి నెట్టేసి ముందుకు వెళ్ళడం - రెండవ దారిని ఎంచుకుంది భాజపా !

గమ్యాన్ని మార్గాన్ని వేరు చేయలేమా అని అడిగారు. చాలా మంచి ప్రశ్న ! గమ్యం ఎంత ముఖ్యమో అందుకు ఎంచుకున్న మార్గం కూడా అంతే ముఖ్యం ! ఫలానా రోజున గమ్యం చేరిన తర్వాత మనిషిని ఆ మార్గమే మరి మరీ నిలదీసి ప్రశ్నిస్తుంది. అపుడు మనం సమాధానం చెప్పుకోవడానికి మన దగ్గర నీతి, నిజాయితీ నిలిచి ఉండాలి కదా ? చేసిన పాపం చెపితే పోతుంది అని హిందూమతమే భోధించింది.

Anonymous said...

Dera baba is a conman and criminal and not a terrorist. Godmen of his ilk are a different kind of menace. Go to any corner of the globe. Muslims are the troublemakers. Islam is not a religion. It is a barbaric cult. Big joke is they claim Islam to be peaceful. There maybe a few normal persons among them. In general their flawed belief system doesn't allow them to be normal. Armchair experts and pseudo sickulars in India are causing more harm than terrorists.