Monday, September 4, 2017

డైనమిక్ లేడీ

 కొయిలాల కమ్మని కధ వింటావా ? (7)

బాలాజీకి పెళ్ళి సంబంధాలు చూసేటపుడు ఒక బ్యాంక్ ఎంప్లాయి సంబంధం వచ్చింది. అమ్మాయి ఎత్తుగా, అందంగా డైనమిక్ గా ఉండేది, మరీ ఇంత అందంగా ఉండి, డబ్బు సంపాదిస్తుంటే మన మాట వినదు అనేసుకుని పల్లెటూరు అమ్మాయైతే చెప్పిన మాటవింటూ చెప్పిన పని చేసేస్తారు అని భావించి ఝాన్సీ ని పెళ్ళి చేసుకున్నాడు.

ఝాన్సీ కూడా భర్త మాటకి ఎదురుచెప్పకుండా అణుకువగానే ఉండేది. కొన్నాళయిన తర్వాత చెప్పిన పని చెప్పినట్లు చేసేస్తుంటే ఇదో తెలివి తక్కువ దద్దమ్మ అని అనుకోవడం మొదలుపెట్టాడు. ఝాన్సీ బాగా తెలివి అయిన పిల్ల. భర్త తన మాట వినాలంటే తను అతని మాట వినితీరాలి అని తెలిసిన వనిత కనుక నోరు మెదపకుండా పనులు చేసుకుంటూపోయేది.

మనిషి తను ఉన్న స్థితి కంటే ఎదగాలని కోరుకుంటాడు కనుక ఇలా చెప్పినట్లు వినే పిల్ల డబ్బు సంపాదిస్తే కూడా బాగుంటుంది అని భావించేవాడు. ఝాన్సీ తో బ్యాంక్ పరీక్షలు వ్రాయమంటూ ప్రోత్సహించేవాడు. ఝాన్సీ చాలా నిదానస్తురాలు. నెమ్మదిగా ఉంటూ పనులు చేసుకునే పిల్లకి స్పీడ్ గా సమాధానాలు వ్రాస్తే వచ్చే ఉద్యోగాల్లో రాణించలేకపోయేది.

తన ప్రవృత్తికి తగిన ఉద్యోగం చూసుకుంటాను అని ఝాన్సీ ఎంత చెప్పినా వినేవాడు కాదు. టీచర్ ఉద్యోగం చేస్తే రోజంతా నిలబడి పాఠాలు చెప్పాలి, రోజంతా పనిచేసి అలిసిపోయి వస్తే ఇంట్లో పనులు ఎవరు చేస్తారు వద్దు అనేవాడు. నువ్వు ఉద్యోగం చేస్తే బ్యాంక్ ఉద్యోగం గానీ, గవర్నమెంట్ ఉద్యోగం అయితేనే చేయి లేకపోతే పిల్లలకి చదువు చెప్పుకుంటూ ఇంట్లోనే ఉండు అని తీర్మానించాడు.

గవర్నమెంట్ ఉద్యోగం తనకు ఎలాగూ రాదు అని నిర్ణయించుకున్న ఝాన్సీ రాజకీయాల్లో చేరితే గవర్నమెంట్ లోనే చేరవచ్చు కదా అని ప్రయత్నాలు ప్రారంబించింది.2 comments:

nmrao bandi said...

నమస్తే నీహారిక గారు బాగున్నారా...
నాకెప్పుడూ అనిపిస్తుంటుంది మోడీ గారు చేసిన తెలివైన
పనుల్లో నిర్మలా సీతారామన్ గార్ని, స్మృతి ఇరానీ గార్ని
మంత్రులుగా నియమించడం ఒకటని. ప్రస్తుత క్లిష్ట
పరిస్థితుల్ని ఆవిడ బాలన్సుడ్ గా హేండిల్ చేయగలదని
మనసారా ఆశిద్దాం.

నీహారిక said...

@nmraobandi garu,

చిరకాల దర్శనం ... బాగున్నారా ?
అసలే యుద్ధ వాతావరణం... విదేశాంగ శాఖ, రక్షణ శాఖ లకు ఇద్దరూ మహిళలే ! ఏమైనా తేడా వస్తే సురేష్ ప్రభు ని తీసేసినట్లు తీసేయవచ్చు కానీ ఒకే నెలలో మూడు సార్లు వరుసగా రైలు ప్రమాదాలు జరగడం మాత్రం సహించలేనిది. శాఖ మార్చినందువల్ల ప్రమాదాలు జరుగవని అనుకోడానికి కూడా వీల్లేదు. వ్యవస్థ బాగుంటే మహిళలైనా నెగ్గుకువస్తారు. నిర్మలా సీతారామన్ కి ఇంట్లో దొరికిన స్వేచ్చ బయట కూడా దొర(కితే)కడం అదృష్టం !