Tuesday, September 5, 2017

ఈ పిల్ల నాది....

కొయిలాల కమ్మని కధ వింటావా ? (8)

ఝాన్సీ చామన చాయగా ఉంటుంది. మరీ అందగత్తె కాదు కానీ చూడడానికి బాగుంటుంది. మనిషి నిదానంగా కనిపిస్తే ఒకసారి ట్రై చేసి చూద్దాం అనేవాళ్ళకు కొదువలేదు కదా ? కాలనీ లో కొందరు ఏదో ఒక వంకతో ఆమెతో మాట్లాడడానికి ప్రయత్నించేవారు. ఆ వ్యక్తులు ఆమెను వెంబడిస్తూ ఆమె ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళేవారు. వాళ్ళను కంట్రోల్ చేయక తప్పదు అనుకున్నపుడు ఝాన్సీ బాలాజీకి చెప్పేది. బాలాజీ వెళ్ళి వాళ్ళను పట్టుకుని ఉతికి ఆరేసేవాడు. ఆ కొట్టడం మామూలుగా కూడా కాదు, వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి పారిపోయేలా కొట్టేవాడు. తన భర్త హీరోయిజం చూసి ఝాన్సీ మురిసి ముక్కలయ్యేది. అదే హీరోయిజం తన మీద కూడా చూపించగలడని అర్ధం అవడానికి ఆమెకు చాలా కాలం పట్టింది.  



  

No comments: