Thursday, April 19, 2018

మంగమ్మా నువ్వు ఉతుకుతుంటే అందం ....

చిమ్మని మనోహర్ ఉవాచ :

>>>>దేశానికి స్వతంత్రం వచ్చిననాటి నుంచి అత్యధిక కాలం ఈ దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ నాయకుల స్వార్థ ప్రయోజనాలు, తాత్కాలిక ప్రయోజనాలకోసం వాళ్లు తీసుకొన్న అత్యంత తప్పుడు నిర్ణయాలు, సృష్టించిన పనికిరాని పాలసీలు .. ఇవే మన దేశం ఇప్పటికీ ఇంకా ఒక అభివృధ్ధిచెందుతున్న దేశంగానే మిగిలిపోవడానికి కారణాలు.
మినహాయింపు ఒక్కటే ...
అది మన తెలంగాణ బిడ్డ, తెలుగువాడు .. పి వి నరసింహారావు

దేశం ఆర్థికస్థితిగతుల్ని మార్చడానికి దేశ ప్రధానిగా అప్పుడు పి వి తీసుకొన్న విప్లవాత్మక నిర్ణయాలవల్లనే కనీసం దేశం ఇప్పుడీ స్థితిలో ఉంది. 

అలాంటి మన పి వి మరణించినప్పుడు ఢిల్లీలో అంత్యక్రియలు లేవు. కనీసం ఆయనకు ఢిల్లీలో సమాధిస్థలం కూడా లేదు. 


ఈ వివక్షను మన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఎవరైనా ప్రశ్నించారో లేదో, ప్రశ్నించకపోతే ఎందుకని ప్రశ్నించలేదో, అసలంత దమ్ము వాళ్లకున్నదో లేదో నాకు తెలియదు.  
.>>>>


పీవీ తెలంగాణా వాడు కాబట్టే మంచి జరిగింది అని చెపుతున్నారు. అదే కాంగ్రెస్ 70 ఏళ్ళనుండి బ్రష్టు పట్టించింది అని కూడా చెపుతున్నారు. కే సీ ఆర్ ప్రతిభావంతుడనీ మీరు చెపుతున్నారు. ఆయనకి జీవితాన్ని ఇచ్చింది కూడా కాంగ్రెస్  అని మరిచిపోతున్నారు.

దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని కేసీఆర్ చెప్పారు. చేసారా ? ఏరు దాటాక తెప్ప తగలెయ్యడం మీ తెలంగాణా పాలసీ....అంజయ్య దగ్గరనుండి ఎంతో మంది  అనామకులని( ఈ మాట అనడానికి నేను బాధపడడం లేదు) ముఖ్యమంత్రులను, ప్రధానులను చేసింది కాంగ్రెస్ పార్టీ యే... స్వతంత్ర్యం వచ్చిన దగ్గర నుండీ అత్యధిక కాలం పాలించిందీ (కుటుంబీకులను)నష్టపోయిందీ కూడా కాంగ్రెస్ మాత్రమే !

అందరూ స్వార్ధంగా పనిచేస్తుంటే దానిని భరించింది కూడా కాంగ్రెస్సే ...

వేగంగా నిర్ణయాలు తీసుకోవడంలో కే సీ ఆర్ ముందుంటారు....అంతే వేగంగా నోటి దూల కూడా తీర్చుకుంటారు. మీరు మర్చిపోవచ్చు కానీ పడ్డవాళ్ళు మర్చిపోవడం అంత సులభం కాదు. 

మనం ఈ రోజు ఒక నిర్ణయం తీసుకుంటాం అది మంచో చెడో కాలమే నిర్ణయిస్తుంది. మంచి జరిగితే తెలంగాణా వారిది చెడు జరిగితే ఆంధ్రా వారిదా ? జీవితంలో వచ్చే కష్టనష్టాలకి ఎదుటివాడి మీద నెపం నెట్టేసే బాధ్యతలేని వాళ్ళతో ఏమి మాట్లాడతాం ?

పీ వీ కి డిల్లీ లో అంత్యక్రియలు ఎందుకు చేయలేదో మీకు తెలియదా ? బాబ్రీ కూలుస్తుంటే నోరుమూసుకుని కూర్చున్నాడని సోనియా శిక్షించారు.

ప్రజలు మార్పు కోరుకోవడం సహజం అయితే వైఫల్యాలకు మాత్రం ఒక్కరినే బలిచేయాలనుకోవడం సరి కాదు.
మీ జీవితంలో వైఫల్యాలకు ఎవరిని బలి చేస్తారని అడుగుతున్నాను.

నా ఐడీ మీకు తెలియకపోవచ్చు బ్లాగర్లకు తెలుసు.

ఫోటోలు పెట్టి ఆకర్షించడానికి నాది అనుష్క శెట్టి మొఖమా ఏంటీ ?

అయినాసరే మీకోసమే ఈ పోస్టు....