మొదటిరోజు పోర్ట్ బ్లెయిర్ చేరుకున్నాక ఫ్రెషప్ అయి ముందుగా సెల్యులార్ జైల్ కి వెళ్ళాం.
బ్రిటీషు పాలనకి వ్యతిరేకంగా పోరాటం చేసినవారిలో చాలామంది ఉద్యమకారులని బంధించి అండమాన్ దీవుల్లో ఖైదీలుగా వుంచేవారు. ఈ ఖైదీలందరూ ఈదుకుంటూ దేశానికి తిరిగొచ్చే సాహసానికి ఒడిగట్టడంతో సెల్యులార్ జైలు నిర్మాణం జరిగింది.
సెల్యులార్ జైల్‌కి 'కాలా పానీ' అనే పేరుంది. కాలా అంటే నలుపు. దీవుల్లో నిర్మించడంతోపాటు అత్యంత చీకట్లని అలుముకుని వుండే జైలు నిర్మాణం కారణంగా సెల్యులార్ జైల్‌కి ఆ పేరొచ్చింది.
బ్రిటీషువారికి వ్యతిరేకంగా నినాదాలు చేసే రాజకీయ ఖైదీలని ఎక్కువగా అండమాన్‌లోని ఈ జైలుకి తరలించేవారు.స్వాతంత్ర్య సమరయోధుడు వీర్ సావర్కర్‌ను ఈ జైలులోనే ఉంచారు.
అండమాన్ దీవుల్లోని సెల్యులర్ జైల్ 1896-1906 మధ్య నిర్మించబడింది. ఒక చక్రం ఆకారంలో వుండే ఈ భవనంలో ఏడు విభాగాలుగా భవనాలని నిర్మించారు. ఈ భవనాలకి మధ్య భాగంలో ఒక టవర్‌ని ఏర్పాటు చేశారు. ఈ సెల్యులార్ జైలులో టవర్ వద్ద నుండి ఖైదీలను గమనిస్తుంటారు. ఏడు విభాగాలున్న ఈ జైలులో ఒక్కో విభాగంలో మూడంతస్తులుంటాయి.
ఏడు విభాగాల్లో మొత్తం 696 గదులని నిర్మించారు. ఈ గదుల్లో ప్రవేశించడం కూడా చాలాకష్టంగా వుంటుంది. ఒక్కో గదిలో ఒక్క ఖైదీని మాత్రమే వుంచేవారు.
ఏ ఖైదీ మరో ఖైదీతో మాట్లాడే వీలు లేకుండా వుండేలా జైలు గదులని నిర్మించారు. ప్రతి జైలు గది ప్రవేశ ద్వారం ఊచలు మరో ఖైదీకి కనిపించవంటే ఎంత జాగ్రత్త తీసుకున్నారో అర్థమవుతుంది.
ఏడు విభాగాలుగా వున్న ఒక్కో బ్లాక్ సెంట్రల్ టవర్‌కి అనుసంధానంగా వుండేలా ఒక బ్రిడ్జ్‌ని ఏర్పాటు చేశారు. జైలు అధికారులు మాత్రమే ఉపయోగించే ఈ బ్రిడ్జి ప్రవేశం రాత్రి సమయంలో మూసివేయబడేది. దీని ద్వారా ఒక్కో విభాగానికి రాకపోకలని పూర్తిగా నివారించబడేవి.
జైలు ఆవరణలోని ఒక్కో విభాగం వద్ద ఒక వర్క్‌షెడ్ వుంటుంది. ఇక్కడ అమర్చబడిన గానుగ పరికరాల్ని ఖైదీలే తిప్పాలి.
గింజల నుంచి నూనెని తీసేందుకే ఖైదీలు ఎక్కువగంటలు పనిచేయాల్సి వచ్చేది.
జైలు నుండి కొద్ది దూరం బయటికొస్తే చాలు నాలుగు పక్కలా సముద్రమే కనిపిస్తుంది.
దేశ స్వాతంత్య్రం అనంతరం అండమాన్ సెల్యులర్ జైలు ఒక చారిత్రక మ్యూజియంగా చరిత్రలో చిరస్మరణీయంగా వుండిపోయింది.
సాయంత్రం వేళల్లో అక్కడ లైట్ షో నిర్వహిస్తారు. సెల్యులార్ జైల్లో అప్పట్లో జరిగిన అరాచకాలను చూపించారు.
సాయంత్రం పోర్ట్ బ్లెయిర్ లోనే ఉన్న కోవే బీచ్ కి వెళ్ళడంతో మొదటిరోజు పూర్తయింది.